India Oil Tanker Arrival From Gulf War Zone: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రవాణా ఆగిపోయింది. దీంతో భారత్‌లో తక్షణ సమస్య లేకపోయినా. గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్‌తో చర్చలు జరిపారు. ఫలితంగా భారత్, చైనా ఇంధన నౌకలు ఆర్మూజ్ గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. దౌత్యపరంగా భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. దీంతో ఇంధన నౌకలు భారత్‌కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు భారత్‌కు చేరుకోగా తాజాగా మరో నౌక బుధవారం(మార్చి 18న) చేరుకుంది. యూఏఈలోని పుజైరా పోర్టులో 80,886 టన్నుల ముర్బాన్ క్రూడ్ ఆయిల్‌తో ఃజాగ్ లాడ్కి’ నౌక ఆదివారం బయలుదేరింది. ఇరాన్ దాడులు జరుగుతున్న సమయంలో సాహసోపేతంగా లోడింగ్ పూర్తి చేసి, యుద్ధభూమి దాటి భారతకు వచ్చింది. అంతకుముందు శివాలిక్, నందాదేవి నౌకలు సురక్షితంగా చేరుకున్నాయి.
Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?
దౌత్య విజయం..
హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల్లో భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఇరాన్‌తో చర్చలు నడిపి ఓడల ప్రయాణాన్ని సురక్షితం చేసింది. దీంతో ఆయిల్ తీసుకువచ్చిన నాలుగో భారతీయ నౌకగా నిలిచింది. మొత్తం 611 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఈ రక్షణ దౌత్య ప్రభుత్వ ముందుచూపును హైలైట్ చేస్తుంది. గల్ఫ్ సంఘర్షణలో భారత వాణిజ్య ఓడలకు ప్రాధాన్యత కల్పించింది.
భద్రతా సవాళ్లు అధిగమించి..
యూఏఈపై ఒకవైపు ఇరాన్ దాడులు చేస్తోంది. అగ్నిప్రమాదాలు కూడా జరిగాయి. దీంతో లోడింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. అయినా నౌక దెబ్బతీయకుండా ఉదయం 10:30 గంటలకు బయలుదేరింది. ఫుజైరా ప్రపంచ ఇంధన లాజిస్టిక్స్ కేంద్రంగా ఉండటంతో ఈ ఘటన ప్రపంచవ్యాప్త ఆయిల్ సరఫరాను ప్రభావితం చేసింది.
ఇంధన సంక్షోభ సమయంలో..
నౌకల సురక్షిత రాక భారత 88% క్రూడ్ ఆయిల్ దిగుమతులను రక్షించాయి. ముందస్తు నిల్వలు (25 రోజులు)తో కలిపి ధరలు స్థిరంగా ఉంచాయి. పాకిస్తాన్, శ్రీలంక లాంటి పొరుగు దేశాల కష్టాలతో పోల్చితే, భారత వైవిధ్యీకరణ (రష్యా, అంగోలా) విజయవంతం. ఈ ఘటన దీర్ఘకాల ఇంధన భద్రతకు మార్గం సుగమం చేస్తుంది.
22 భారతీయ నౌకలు ఇంకా గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. కేంద్రం 24/7 మానిటరింగ్ కొనసాగిస్తోంది. ఈ ఆపరేషన్లు గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ బ్లెండింగ్ వంటి స్వావలంబన ప్రయత్నాలను వేగవంతం చేస్తాయి. దౌత్య శక్తి, సైనిక సహకారంతో భారతం ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుతోంది.
