Homeఅంతర్జాతీయంBangladesh student leader: బంగ్లాదేశ్‌లో హిందూ హంతకుడు.. భారత్‌లో చిక్కాడు.. ఇంతకీ ఎవడు వాడు?

Bangladesh student leader: బంగ్లాదేశ్‌లో హిందూ హంతకుడు.. భారత్‌లో చిక్కాడు.. ఇంతకీ ఎవడు వాడు?

Bangladesh student leader: బంగ్లాదేశ్‌లో రెండేళ్ల క్రితం రిజర్వేషన్ల అంశంపై మొదలైన యువత నిరసన చినికి చినికి గాలివానలా.. కాదు కాదు.. తుఫానులా మారింది. ప్రధాని షేక్‌ హసీనా వాజిద్‌ చివరకు గద్దె దిగాల్సి వచ్చింది. దేశం విడిచి పారిపోయేలా చేశారు. ఇక తర్వాత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈయన పాలనలో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. కనీవిని ఎరుగని రీతిలో జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యా. సభ్‌ ఇన్‌స్పెక్టర్‌ […]

Bangladesh student leader: బంగ్లాదేశ్‌లో రెండేళ్ల క్రితం రిజర్వేషన్ల అంశంపై మొదలైన యువత నిరసన చినికి చినికి గాలివానలా.. కాదు కాదు.. తుఫానులా మారింది. ప్రధాని షేక్‌ హసీనా వాజిద్‌ చివరకు గద్దె దిగాల్సి వచ్చింది. దేశం విడిచి పారిపోయేలా చేశారు. ఇక తర్వాత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈయన పాలనలో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. కనీవిని ఎరుగని రీతిలో జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యా.

సభ్‌ ఇన్‌స్పెక్టర్‌ దారుణ హత్య..
హిందువులపై దాడుల్లో భాగంగా ఓ విద్యార్థి సంఘం నాయకుడు బంగ్లాదేశ్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను సజీవ దహనం చేశాడు. ఈ ఘటన 2024–25లో హబీబ్‌గంజ్‌ జిల్లా బనియాచంగ్‌ గ్రామంలో జరిగింది. విద్యార్థి నాయకుడు అహ్మద్‌ రజా హసన్‌ మెహదీ అనే వ్యక్తి సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ చౌదరిని సజీవంగా దహనం చేశాడు. అహ్మద్‌ తాను ఈ హత్యకు పాల్పడ్డానని, తన చర్యపై సంతోషంగా ఉన్నానని బహిరంగంగా ప్రకటించాడు. ఈ ఘటన రాజకీయ అస్థిరతలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో జరిగింది.

పారిపోయేందుకు యత్నించి..
హత్య తర్వాత అహ్మద్‌ బంగ్లాదేశ్‌ను వదిలి ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి నుంచి యూరప్‌కు పారిపోవడానికి విమానాశ్రయంలో ప్రయత్నించాడు. భారతీయ భద్రతా సిబ్బంది అతన్ని అరెస్ట్‌ చేసి, విచారణలో హత్యకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అహ్మద్‌ గుర్తింపు నిర్ధారణైన తర్వాత, అతని పాత్రను ధ్రువీకరించారు. దీంతో అతడిని భారత్‌ బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించింది. ఈ చర్య అతని పారిపోవడానికి విఫలమైనట్టు నిర్ధారించింది.

ఈ ఘటన షేక్‌ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో ఏర్పడిన శూన్యతను ప్రతిబింబిస్తుంది. విద్యార్థి నాయకులు నాయకత్వం వహించిన అస్తవ్యస్త పరిస్థితుల్లో మతపరమైన దాడులు పెరగడం ఆందోళనకరం. అహ్మద్‌ వంటి వ్యక్తులు తమ చర్యలను గర్వంగా ప్రకటించడం సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తమైన హింసా సంస్కృతిని సూచిస్తుంది.

 

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper