Homeఎంటర్టైన్మెంట్Vishwambhara Movie First Review: విశ్వంభర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది...ఎలా ఉందంటే..?

Vishwambhara Movie First Review: విశ్వంభర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది…ఎలా ఉందంటే..?

Vishwambhara Movie First Review: స్వయంకృషితో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని స్టార్ హీరోగా మారిన వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎన్నో కష్టనష్టాలను భరించాడు. అవకాశం వచ్చినప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే చిరంజీవి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు… అలాంటి చిరంజీవి 70 సంవత్సరాల వయసులో కూడా సినిమాలను చేస్తున్నాడు అంటే అతనికి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. […]

Vishwambhara Movie First Review: స్వయంకృషితో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని స్టార్ హీరోగా మారిన వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎన్నో కష్టనష్టాలను భరించాడు. అవకాశం వచ్చినప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే చిరంజీవి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు… అలాంటి చిరంజీవి 70 సంవత్సరాల వయసులో కూడా సినిమాలను చేస్తున్నాడు అంటే అతనికి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. మన శంకర వరప్రసాద్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు… వశిష్ట డైరెక్షన్లో చేసిన ‘విశ్వంభర’ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విశ్వంభర సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా చిరంజీవికి ఎలాంటి క్రేజ్ వస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. గత సంవత్సరం సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ అంత ఎఫెక్ట్ గా లేదనే రిలీజ్ ఆపేశారు.

మరోసారి గ్రాఫిక్స్ వర్క్ అయితే చేయిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాని కొంతమంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు చూసినట్టుగా తెలుస్తుంది. సినిమా సెలబ్రిటీలు ఈ సినిమాని చూసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. మొత్తానికైతే చిరంజీవి ఇందులో ఒక వీరుడిలా కనిపించబోతున్నాడట.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో ఎలాగైతే తన సాహసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడో ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ముందుకు సాగుతున్నాడట. అదే స్థాయి స్టామినాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు అంటూ వాళ్ళు చెబుతున్నాడు విశేషం…ఇక ఈ సినిమాలో చాలావరకు గ్రాఫిక్స్ వర్క్ ఉండడంతో ఈ సినిమాని దర్శకుడు ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించాడట.

ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం అంటూ వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. ఇందులో చిరంజీవి క్యారెక్టర్ కూడా చాలా బాగుందని చెబుతున్నారు. కాబట్టి ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సమ్మర్ లో అయిన ఈ సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper