Homeఅంతర్జాతీయంPakistan Militants: దురంధర్ తరుముతున్నాడు.. యుగంధర్ వెంటపడుతున్నాడు.. పాపం పాకిస్తాన్

Pakistan Militants: దురంధర్ తరుముతున్నాడు.. యుగంధర్ వెంటపడుతున్నాడు.. పాపం పాకిస్తాన్

Pakistan Militants: పాకిస్తాన్ దేశంలో దురంధర్ అనే పేరు వినిపిస్తే చాలు అక్కడి పాలకులకు.. ఉగ్రవాదులకు ఉ* కారిపోతుంది. ఆ సినిమా భారత దేశంలో విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మనదేశంలో కంటే పాకిస్తాన్లో ఎక్కువగా ప్రజలు చూసిన సినిమాగా అది రికార్డు సృష్టించింది. దీనిని బట్టి ఆ సినిమాలో వాస్తవాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దురంధర్ సినిమాలో చూపించినట్టుగానే పాకిస్థాన్లో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదుల విషయంలో కొంతమంది […]

Pakistan Militants: పాకిస్తాన్ దేశంలో దురంధర్ అనే పేరు వినిపిస్తే చాలు అక్కడి పాలకులకు.. ఉగ్రవాదులకు ఉ* కారిపోతుంది. ఆ సినిమా భారత దేశంలో విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మనదేశంలో కంటే పాకిస్తాన్లో ఎక్కువగా ప్రజలు చూసిన సినిమాగా అది రికార్డు సృష్టించింది. దీనిని బట్టి ఆ సినిమాలో వాస్తవాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దురంధర్ సినిమాలో చూపించినట్టుగానే పాకిస్థాన్లో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదుల విషయంలో కొంతమంది చేస్తున్న పనులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

పాకిస్తాన్ లో కొంతకాలంగా ఉగ్రవాదులను గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపేస్తున్నారు. గతంలో ఈ దాడులు ఒక క్రమ పద్ధతి ప్రకారం జరిగితే.. ఇటీవల కాలంలో అవి మరింత పెరిగిపోయాయి. తాజాగా లష్కరే సంబంధించిన ఒక ఉగ్రవాదిని అజ్ఞాత సాయుధ దళాలు చంపేశాయి. అతడు పాకిస్తాన్లో అత్యంత మారుమూల ప్రాంతంలో జీవిస్తున్నాడు. కనీసం ఫోన్ కూడా ఉపయోగించడం లేదు. తనకు సంబంధించిన ఎటువంటి వివరాలు కూడా బయటికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ అజ్ఞాత సాయుధ దళాలు అతడిని చంపేశాయి. హాయ్ చెప్పి.. బాయ్ అంటూ పైకి పంపించాయి.

ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఐ ఎస్ ఐ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక ఉగ్రవాది విషయంలో కూడా ఇలాంటి పనిని అజ్ఞాత సాయుధ దళాలు చేశాయి.. అతడిని చంపడం మాత్రమే కాకుండా.. అతని కుటుంబాన్ని కూడా కనిపించకుండా చేశాయి. ఆ తర్వాత కరాచీలో ఉంటూ లష్కరే ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న ఒక వ్యక్తి విషయంలో కూడా అజ్ఞాత సాయుధ దళాలు ఇదేవిధంగా ప్రవర్తించాయి. అతడిని కూడా కాల్చి చంపేసాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో ఉగ్రవాదులను చంపడం పాకిస్తాన్ దేశంలో కొత్త కాకపోయినప్పటికీ.. భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న వారందరి పైన దాడులు జరుగుతున్నాయి. అరుదైన సందర్భాల్లోనే ఉగ్రవాదులకు గాయాలవుతున్నాయి. వారు చికిత్స పొంది.. ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ.. వారు ఊహించని విధంగా గాలిలో కలిసిపోతున్నారు.

పాకిస్తాన్ లో దురంధర్ ఆపరేషన్లు దర్జాగా సాగుతుండగా.. ఈ ఆపరేషన్ల వెనుక యుగంధర్ లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ దురంధర్ ఎవరు.. దురంధర్ ను నడిపిస్తున్న యుగంధర్ ఎవరు.. అనేది అందరికీ తెలుసు. కానీ బయటికి చెప్పలేరు. మరోవైపు మనదేశంలో కూడా మీడియా ఉగ్రవాదులు చనిపోయిన వార్తలను రాయదు. కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ఈ వార్తలను రాసి రాయినట్టుగా రాస్తున్నాయి. వేసి వేయనట్టుగా వేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper