spot_img
Homeఅంతర్జాతీయంChinese PHL-81 MLRS system: చైనా లాంచర్‌ మిస్‌ఫైర్‌.. 8 మంది కాంబోడియా సైనికుల దుర్మరణం

Chinese PHL-81 MLRS system: చైనా లాంచర్‌ మిస్‌ఫైర్‌.. 8 మంది కాంబోడియా సైనికుల దుర్మరణం

Chinese PHL-81 MLRS system: చైనా.. తయారీ రంగంలో దూసుకుపోతోంది. ఆర్థికంగా రెండో సంపన్న దేశంగా గర్తింపు పొందింది. అయితే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతీ నాణ్యమైన వస్తువుకు డ్యూప్లికేట్‌ తయారు చేయడంలో చైనా దిట్ట. అందుకే వేగంగా తయారీ రంగంలో ఎదిగింది. ఇక ఇప్పుడు ఆయుధాల తయారీలోనూ చైనా వైఫల్యం కనిపిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ భారత్‌పై ప్రయోగించిన చైనా రాకెట్‌ పేలకుండా విఫలమైంది. తాజాగా కంబోడియా–థాయ్‌లాండ్‌ యుద్ధ సమయంలో నూ చైనా తయారు చేసిన మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌(ఎంఎల్‌ఆర్‌ఎస్‌) విస్‌ఫైర్‌ అయింది. దీంతో 8 మంది కంబోడియా సైనికులు మరణించారు. ఈ ఘటన యుద్ధ ప్రదేశంలో భారీ నష్టానికి దారితీసింది. చైనా ఆయుధాలపై ఆధారపడిన కంబోడియా సైన్యం ఈ పరాజయంతో తీవ్ర ఆందోళనకు గురైంది.

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలోనూ..
చైనా సామగ్రి భారత్‌–పాక్‌ సంఘర్షణలో కూడా పనిచేయలేకపోయింది. పాకిస్తాన్‌ సైన్యం ఆధారపడిన ఈ ఆయుధాలు టెక్నికల్‌ లోపాలతో విఫలమయ్యాయి. చైనా రాకెట్‌ భారత భూభాగంలో పడడంతో మన సైంటిస్టులు దానిని విశ్లేషించారు. చైనా తయారీ వస్తువులన్నీ నాసిరకం అని గుర్తించారు. ఈ ఘటనలు చైనా ఎక్స్‌పోర్ట్‌ ఆయుధాల నాణ్యతను ప్రశ్నార్థకం చేశాయి.

లోపాల వెనుక కారణాలు
చైనా ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వంటి వ్యవస్థల్లో తక్కువ ధరలకు త్వరిత ఉత్పత్తి, పరీక్షల లోపాలు కీలక సమస్యలు. రష్యా, ఇజ్రాయెల్‌ వంటి దేశాల ఆయుధాలతో పోల్చితే ఈ సిస్టమ్‌లు యుద్ధ పరిస్థితుల్లో స్థిరత్వం చూపలేవు. అధిక ఒత్తిళ్లలో ఇంధన సమస్యలు, ఎలక్ట్రానిక్స్‌ విఫలాలు తరచూ జరుగుతున్నాయి. ఈ పరాజయాలు చైనా ఆయుధాలపై ఆధారపడే దేశాల్లో అపనమ్మకాన్ని పెంచాయి. భారత్‌ స్వదేశీ రక్షణ వ్యవస్థలు, అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులు ప్రపంచ స్థాయిలో పోటీపడుతున్నాయి.

కంబోడియా, పాకిస్తాన్‌ వంటి దేశాలు ఆయుధ ఎంపికలో నాణ్యత, యుద్ధ పరీక్షలపై దృష్టి పెట్టాలి. చైనా తన ఉత్పత్తి ప్రమాణాలను మెరుగుపరచాలి. భారత్‌కు ఈ ఘటనలు స్వయం సమృద్ధి రక్షణ పరిశ్రమకు స్ఫూర్తిగా మారాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper