Homeఅంతర్జాతీయంIslamic NATO Alliance: అమెరికాకు ఇస్లామిక్ నాటో షాక్.. కూటమిలోకి ఇరాన్!

Islamic NATO Alliance: అమెరికాకు ఇస్లామిక్ నాటో షాక్.. కూటమిలోకి ఇరాన్!

Islamic NATO Alliance: పశ్చిమాసియాలో ఘర్షణలు పెరుగుతున్నాయి. చాలా దేశాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సౌదీ, యెమెన్, ఇండియా పాకిస్తాన్, ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే మధ్య ఇటీవల సమష్టి రక్షణ ఒప్పందం కుదిరింది. దీనిని ఇస్లామిక్ నాటో గా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది ప్రాంతీయ భద్రతా వ్యవస్థలో ముఖ్యమైన మార్పు. పలు దేశాలు ఇందులో చేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో కూటమి నుంచి ఇరాన్‌కు […]

Islamic NATO Alliance: పశ్చిమాసియాలో ఘర్షణలు పెరుగుతున్నాయి. చాలా దేశాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సౌదీ, యెమెన్, ఇండియా పాకిస్తాన్, ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే మధ్య ఇటీవల సమష్టి రక్షణ ఒప్పందం కుదిరింది. దీనిని ఇస్లామిక్ నాటో గా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది ప్రాంతీయ భద్రతా వ్యవస్థలో ముఖ్యమైన మార్పు. పలు దేశాలు ఇందులో చేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో కూటమి నుంచి ఇరాన్‌కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

ఒప్పందం ఏర్పాటు..
ఈ సంవత్సరం ఆగస్టు 7న మక్కాలో పాకిస్తాన్ సౌదీ అరేబియా, టర్కీ మధ్య సంతకాలు జరిగాయి. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. నాటో కూటమిలోని ఆర్టికల్ 5ను పోలిన నిబంధన ఇందులో ఉంది. ఏ ఒక్క సభ్య దేశంపై దాడి జరిగినా, అది అందరి మీద జరిగినట్లుగా పరిగణించబడుతుంది. సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య గతంలో ఉన్న ద్వైపాక్షిక రక్షణ ఏర్పాటును విస్తరించి తుర్కియేను చేర్చడం ద్వారా ఈ త్రైపాక్షిక ఒప్పందం ఆవిర్భవించింది.

మూడు దేశాల బలాలు..
పాకిస్తాన్ అణ్వస్త్ర సామర్థ్యం, తుర్కియే నాటో సభ్యత్వం, సౌదీ అరేబియా చమురు సంపద ఈ కూటమికి బలాన్ని అందిస్తున్నాయి. ప్రాంతీయ దేశాలు అమెరికా రక్షణపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి వైపు అడుగులు వేశాయి.

ఇరాన్‌కు ఆహ్వానం..
ఇటీవల ఇరాన్‌కు ఈ ఒప్పందంలో చేరాలని ఆహ్వానం అందినట్లు ఇరాన్ మంత్రి ప్రకటించారు. ఇరాన్ పార్లమెంట్ సంబంధిత కీలక నేత మెహ్దీ రహీమీ ఈ విషయాన్ని సమీక్షిస్తున్నామని, ఇది టెహ్రాన్‌కు ఒక విజయంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతా కూటమి కోసం ఇరాన్ చాలాకాలంగా పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఆహ్వానం వచ్చినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిని ఇరాన్ విదేశాంగ శాఖ, ఇస్లామిక్ నాటో ఒప్పందంలోని మూడు దేశాలు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

ఆహ్వానంపై అనుమానాలు..
సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతు ఉన్న హూతీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌కు ఆహ్వానం ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందంలో చేరితే, హూతీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఆహ్వానం ఎంతవరకు ఫలిస్తుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఇప్పటికీ శాశ్వత శాంతి ఒప్పందం కుదరలేదు. ఈ ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ప్రాంతం మొత్తంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. దేశాలు బాహ్య శక్తులపై ఆధారపడకుండా సొంత రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాయి. మక్కా ఒప్పందం ఇందుకు ఉదాహరణ.

ఈ ఒప్పందం ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం సహకారాన్ని పెంచే అవకాశం ఉంది. అయితే భిన్నమైన భద్రతా ప్రాధాన్యతలు, చారిత్రక విభేదాల నేపథ్యంలో అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ చేరిక జరిగితే, ప్రాంతీయ భద్రతా నిర్మాణం మరింత విస్తృతమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper