Baloch fighters attack Pakistan: ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్, శ్రీలంకలో అయితే లాక్‌డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది పాక్ ప్రభుత్వం. రిపబ్లిక్ డే వేడుకలను కూడా రద్దు చేసింది. ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్‌లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్‌లో స్వతంత్య్ర పోరాటం మరింత ఉగ్రరూపం దాల్చింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ), బలూచ్ సాలిడారిటీ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ వంటి విప్లవ సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వ వ్యవస్థలు, వరుస దాడులు చేస్తున్నాయి తాజాగా బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా సమీపంలోని సూయి ప్రాంతంలో, పంజాబ్‌కు గ్యాస్ సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థకు కీలకమైన పంజాబ్ రాష్ట్రానికి గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
పంజాబ్‌కు ఊపిరి ఆగిపోయింది
క్వెట్టాకు సమీపంలోని అక్తరాబాద్/సూయి ప్రాంతంలో 18 అంగుళాల వ్యాసం కలిగిన ప్రధాన గ్యాస్ పైప్‌లైన్‌ను మార్చి 30, 2026 రాత్రి బలూచ్ వీరులు ధ్వంసం చేశారు. భారీ మంటలు చెలరేగయి. గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ దాడితో క్వెట్టా, మాస్తుంగ్, కలాత్, పిషిన్, జియారత్ వంటి ఐదుకు పైగా జిల్లాల్లో గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికి వెళ్లే మెయిన్ లైన్ తెగిపోవడంతో లాహోర్, ఫైసలాబాద్, రావల్పిండి వంటి పారిశ్రామిక నగరాలకు గ్యాస్ అందడం లేదు.
వనరుల దోపిడీపై బలూచ్ వీరుల ఆగ్రహం
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద రాష్ట్రం కానీ, అత్యంత పేద ప్రాంతం. ఇక్కడ అపారమైన సహజ వనరులు ఉన్నాయి, కానీ అవి బలూచ్ ప్రజలకు ఉపయోగపడటం లేదు.పాకిస్తాన్ మొత్తం గ్యాస్ నిల్వలలో 40 శాతం పంజాబ్, కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. రికొడిక్ ప్రాంతంలో భారీ నిల్వలు పాక్ ఆర్మీ, చైనా కంపెనీలు తవ్వుకుపోతున్నాయి. చైనా–పాక్ జాయింట్ వెంచర్లు నిర్వహిస్తున్నా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. బొగ్గు నిల్వలను పంజాబ్ పారిశ్రామికవేత్తలు తవ్వుకుని వ్యాపారం చేస్తున్నారు.
తామే ధ్వంసం చేశామని బలూచ్ వీరుల ప్రకటన..
‘మా భూమిలోని గ్యాస్, బంగారం, రాగి, బొగ్గు వనరులన్నీ పంజాబ్ రాజకీయ నాయకులు, పాక్ ఆర్మీ దోచుకుంటున్నారు. మా వనరులతో వారు ఐశ్వర్యంగా జీవిస్తున్నారు, మేము కటిక పేదరికంలో మగ్గుతున్నాము. అందుకే గ్యాస్ పైప్‌లైన్‌ను ధ్వంసం చేశాము. మా హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది‘ అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
పాకిస్తాన్‌కు భారీ నష్టం..
గత రెండేళ్లలో బలూచ్ వీరుల దాడులతో పాకిస్తాన్‌కు కలిగిన నష్టం భారీగా ఉంది 200 మందికిపైగా సైనికులను చంపేశారు. 20 మందికిపైగా అధికారులను కిడ్నాప్ చేశారు. 48 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. 23 చెక్‌పాయింట్లు, సైనిక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్యాస్ పైప్‌లైన్లు ధ్వంసం చేశారు. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ ఓడరేవు, చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్‌పై బలూచ్ వీరులు వరుసగా దాడులు చేస్తున్నారు.
సూయి గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం బలూచ్ ప్రజల ఆక్రోశానికి ప్రతీక. వనరులను దోచుకుంటూ, స్థానిక ప్రజలను కటిక పేదరికంలో ఉంచిన పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై తిరుగుబాటు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇతర విప్లవ సంస్థలు పంజాబ్‌కు గ్యాస్ సరఫరా నిలిపివేయడం ద్వారా, పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థను నేరుగా దెబ్బ కొట్టాయి.
