Homeఅంతర్జాతీయంPakistan Economic Crisis 2026: అమెరికా వాడుకుని వదిలేసింది.. సౌదీ ఛీ కొట్టింది.. ఐఎంఎఫ్ జాడిచ్చి...

Pakistan Economic Crisis 2026: అమెరికా వాడుకుని వదిలేసింది.. సౌదీ ఛీ కొట్టింది.. ఐఎంఎఫ్ జాడిచ్చి తన్నింది.. పాపం పాక్ పరిస్థితి..

Pakistan Economic Crisis 2026: మన దాయాది దేశం పాకిస్తాన్‌కు కొన్ని రోజులుగా వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇరాన్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి దెబ్బమీద దెబ్బ పడుతోంది. తాజాగా గడిచిన 48 గంటల్లో ఎదుర్కొన్న మూడు షాక్‌లు దాని ఆర్థిక, సైనిక, రాజకీయ స్థితిని తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ సంఘటనలు దేశాన్ని బహిరంగ యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, మిత్రరాజ్యాల అండ లేకపోవడంతో ఒక్కసారిగా ఒత్తిడికి తీసుకువచ్చాయి. Also Read: తణుకులో ‘తానా’ రైతు సేవా […]

Pakistan Economic Crisis 2026: మన దాయాది దేశం పాకిస్తాన్‌కు కొన్ని రోజులుగా వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇరాన్‌ యుద్ధం మొదలైన నాటి నుంచి దెబ్బమీద దెబ్బ పడుతోంది. తాజాగా గడిచిన 48 గంటల్లో ఎదుర్కొన్న మూడు షాక్‌లు దాని ఆర్థిక, సైనిక, రాజకీయ స్థితిని తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ సంఘటనలు దేశాన్ని బహిరంగ యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, మిత్రరాజ్యాల అండ లేకపోవడంతో ఒక్కసారిగా ఒత్తిడికి తీసుకువచ్చాయి.

Also Read: తణుకులో ‘తానా’ రైతు సేవా యజ్ఞం – 1000 మంది రైతులకు రూ. 25 లక్షల విలువైన పరికరాల పంపిణీ

అమెరికా రాయబారీ కార్యాలయం మూసివేత
మొదటి షాక్‌ అమెరికా ఇచ్చింది. నమ్ముకున్న దేశం నట్టేట ముంచింది. ఖైబర్‌ పక్తూంఖ్వా రాజధాని పెషావర్‌లోని అమెరికా రాయబారీ కార్యాలయాన్ని మూసేయాలని వాషింగ్టన్‌ నిర్ణయించింది. అంతర్గత ఉగ్రవాద దాడులు, టీటీప(తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ పాకిస్తాన్‌) దాడులు పెరగడం, తాలిబాన్‌ దాడులు పెరగడంతో అమెరికాకు పాకిస్తాన్‌లో భద్రత హామీ లేకపోయింది. ఇది పాకిస్తాన్‌కు సైనిక, రాజకీయంగా పెద్ద దెబ్బ. అమెరికా మద్దతు లేకపోతే దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలో పాక్‌ ప్రభావం తగ్గుతుంది.

ఐఎంఎఫ్‌ రుణానికి బ్రేక్‌..

ఇక రెండో షాక్‌ ఐఎంఎఫ్‌ ఇచ్చింది. గతంలో ఇస్తామన్న 1 బిలియన్‌ డాలర్ల రుణాన్ని నిలిపివేసింది. లోటు బడ్జెట్, రుణ తిరిగి చెల్లింపు సమస్యలు, పెట్రోల్‌ ధరలు 150–200 రూపాయలు పెంచాలి, విద్యుత్‌ టారిఫ్‌లు ఎగ్జిబిట్‌ చేయాలి, సబ్సిడీలు రద్దు చేయాలని కఠిన షరతులు వేసింది. ఇది పాక్‌ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడికి తీసుకువస్తుంది. అంతర్జాతీయ సంస్థల నమ్మకం కోల్పోవడం ప్రమాదకరం.

సౌదీ అరేబియా సైనిక సహాయం..
ఇక మూడోషాక్‌ సౌదీ అరేబియా ఇచ్చింది. ప్రస్తుతం ఇరాన్‌ దాడుల నేపథ్యంలో తమ డిఫెన్స్‌ డీల్స్‌కు పాక్‌ సైన్యాన్ని అండగా నిలబెట్టమని కోరింది. కానీ పాకిస్తాన్‌ , బదులుగా బంగారు గనులు ఇస్తామని ప్రతిపాదించింది. అయితే పాక్‌ బంగారు గనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సైన్యాన్ని పంపాలని స్పష్టం చేసింది. ఇది పాక్‌ను జియోపొలిటికల్‌ ఆయిల్‌గా మార్చేస్తుంది. మిత్రరాజ్యాల సహాయం కోరడం దాని స్వాతంత్య్రాన్ని, సైనిక బలాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది.

ఈ మూడు షాక్‌లు పాకిస్తాన్‌ను ఆర్థికంగా కుంగిపోయేలా, సైనికంగా బలహీనపడేలా, రాజకీయంగా ఒంటరిగా మార్చాయి. ఒకప్పుడు ప్రాంతీయ శక్తిగా భావించుకున్న పాక్, ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడాల్సి వచ్చింది. ఆఫ్గాన్‌ ఉద్రిక్తతలతో కలిపి ఇది ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper