1975 Banqiao Dam Disaster: 1975 Banqiao Dam Disaster: నేపాల్ దేశాన్ని వరదలు చుట్టు ముట్టాయి. కనివిని ఎరుగని స్థాయిలో నష్టాన్ని కలగజేసాయి. ఇప్పటికీ ఆ దేశానికి వరద ముప్పు తొలగిపోలేదు. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో వరదలు వచ్చాయి. భీకరమైన వర్షాలు చాలా కురిశాయి. కానీ యావత్ ప్రపంచం మొత్తం భయంతో గజగజలాడిన ఒక పెనువిపత్తు.. చాలాకాలం తర్వాత వెలుగులోకి వచ్చింది.
చైనా దేశంలో 1975 జూలై చివరి నెలలో ఫిలిప్పీన్స్ సముద్రంలో టైపూన్ నీనా చోటుచేసుకుంది. అది కొద్ది రోజుల్లోనే తీవ్రంగా బలపడింది. తైవాన్ మీదుగా కదిలి.. చైనాలోని పూజియాన్ ప్రావిన్స్ పరిధిలో తీరం దాటిపోయింది. నాడు హెనాన్ ప్రాంతంలోది పెను విపత్తును సృష్టించింది. విపరీతంగా వర్షం కురవడంతో 24 గంటల్లోనే 1000 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదయింది. ఆగస్టు ఐదు నుంచి ఏడు తేదీల మధ్యలో ఏకంగా 1605 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.. ఫలితంగా హెనాన్ ప్రాంతంలోని బాంకియావో ప్రాజెక్టుకు విపరీతంగా వరద వచ్చింది. సెకండ్ కాలంలోనే 13 క్యూబిక్ మీటర్ల చొప్పున వరదనీరు వచ్చిందంటే.. వర్షం ఏ స్థాయిలో కురిసిందో అర్థం చేసుకోవచ్చు.
నాడు ఆగస్టు 7న అర్ధరాత్రి దాటిన తర్వాత బాంకియావో అనే డ్యామ్ రక్షణ గోడ పైనుంచి నీరు వచ్చింది. కొద్దిగంటలలోనే రిజర్వాయర్ మొత్తం ధ్వంసం అయింది.. భారీగా నీరు కిందికి వచ్చింది. కేవలం 6 గంటల వ్యవధిలోనే 701 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు డ్యామ్ నుంచి కిందికి వచ్చింది. 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో నీరు కిందికి ప్రవహించింది. ఇదే ప్రాజెక్టుకు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో డ్యాం కూడా పొంగిపొర్లిపోయింది. ఇలా మొత్తంగా 62 డ్యాములు ధ్వంసం అయిపోయాయి. అనేక గ్రామాలు.. పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అయితే విపత్తును 20 సంవత్సరాల పాటు ప్రపంచానికి తెలియకుండా చైనా దాచి పెట్టింది. కేవలం వర్షం మాత్రమే కురిసింది అన్నట్టుగా వార్తలను ప్రసారం చేసింది.
ఈ విలయానికి సంబంధించిన రికార్డులను చైనా 30 సంవత్సరాల పాటు దాచి పెట్టింది. నాడు చాలామంది వారం రోజులపాటు జలదిగ్బంధంలోనే ఉన్నారు. కొందరు ఆకులు తిని బతికారు. కొందరు ఆకలికి తట్టుకోలేక చనిపోయారు. నాడు జరిగిన ఈ ఘటన వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 2.3 లక్షల మంది చనిపోయారు. డ్యామ్ నిర్మాణాలలో నాణ్యత పాటించకపోవడం.. అవినీతికి పాల్పడడం వల్లే అవి తెగిపోయాయని వార్తలు వచ్చాయి. అయితే దీనిని చైనా ఖండించింది. కమ్యూనిస్టు నాయకుడు మావో జెడంగ్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే రు నది మీద బాంకి యావో డ్యామ్ నిర్మించారు. నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతోనే ఈ విపత్తు చోటుచేసుకుంది.