రాజకీయాల్లో సరిగా గమనిస్తే అందరికీ ఒక కామన్ విషయం అర్థమవుతుంటుంది. అదేంటంటే..! పార్టీ ఏదైనా తమ సొంత పార్టీని కాకుండా అపోజిషన్ పార్టీనే ఎక్కువగా కలవరిస్తుంటాయి. అపోజిషన్ లీడర్లనే ఎక్కువగా తలుస్తుంటారు. ఏపీలో ఇప్పుడు జగన్ సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి.. అపోజిషన్‌లో ఉన్న చంద్రబాబు జగన్ గురించే మాట్లాడుతుంటారు. ఇక సీఎం జగన్ కూడా నిత్యం చంద్రబాబు మీదనే విమర్శలు చేస్తుంటారు. అయితే.. పొలిటికల్‌గా అది ఒక్కోసారి బలాన్ని తెచ్చిపెడుతుంటాయి. కానీ.. కొన్ని సందర్భాల్లో అదే మైనస్ అవుతుంటుంది.
Also Read: అయోధ్య మసీదులో నమాజ్ చేసినా పాపమే.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
జగన్ నిత్యం చంద్రబాబునే మననం చేసుకుంటూ ఉంటారు. అయితే.. అది చివరకు ఎక్కడికి దారితీసిందంటే తనకు అడ్డం తిరిగిన ప్రతి పనిలోనూ చంద్రబాబు హస్తం ఉందని అంటున్నారు. తాను ఎక్కడ ఫెయిల్ అయినా దానికి చంద్రబాబే కారణమని ఆడిపోసుకుంటున్నారు. బాబే అన్నీ చేయిస్తున్నారని.. ఆయనే తెర వెనక చక్రం తిప్పుతున్నారు అని జగన్ అనుమానిస్తూ ఇపుడు తన కంటే ఎక్కువగా చంద్రబాబును చేసి జనాలకు చూపిస్తున్నారు.
ఇరవై నెలలుగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కనుసన్ననలోనే పాలన మొత్తం సాగుతోంది. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి. పైగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సీట్లకు చంద్రబాబు పార్టీ పడిపోయింది. ఇక కేంద్రంలోని బీజేపీ అయితే బాబుకు ఏ మాత్రం సహకరించడంలేదు. చంద్రబాబును నేటికీ బీజేపీ పెద్దలు దూరంగానే పెట్టారు. పార్టీ ప్రభ కూడా నానాటికీ దిగజారుతోంది. కుమారుడు లోకేష్ ఎక్కడా అందుకు రావడం లేదన్న బాధ బాబులో ఉంది. మరి ఇంతలా చితికిపోతున్న టీడీపీనీ.. ఆ పార్టీ నేతల కంటే ఎక్కువగా జగన్ తలుస్తున్నారు.
Also Read: నిమ్మగడ్డది నడవదంతే.. కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ
చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే అపర చాణక్యుడు అంటూ తనకు లేనిపోని కొత్త క్రెడిట్లు ఆయనకు అంటగడుతున్నారు. నిజానికి చంద్రబాబుకు వ్యవస్థలలోని కీలకమైన వ్యక్తులతో కొన్ని తెర వెనక బంధాలు ఉన్నాయని అంటారు. అయితే.. ఏ బంధం అయినా అధికారం, డబ్బు ముందు ఏ మాత్రం పనికిరావు. చంద్రబాబు ఇపుడు విపక్షంలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆయనతో ఒరిగేది ఏమీ ఉండదు. మరోసారి ఎన్నికల్లో ఆయన నెగ్గుతారన్న నమ్మకం సొంత పార్టీకే లేదు. కానీ.. జగన్ చంద్రబాబును ఇలా నిత్యం జపిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేసే అంశం. ఇక న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదు. అలాగే తన సర్కార్ లోని లోపాలను ముందుగా గుర్తించాలి. రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు ఉండేలా చూసుకోవాలనేది నిపుణుల అభిప్రాయం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Why cm jagan target chandrababu naidu so much
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com