Nagababu : ఉగాదికి( Ugadi) పొలిటికల్ హీటెక్కించే పరిణామాలు జరగబోతున్నాయా? రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరగనుందా? ఆరేడుగురు మంత్రులకు ఉద్వాసన పలకనున్నారా? కొత్తగా సీనియర్లను తీసుకొనున్నారా? అదే జరిగితే వేటు పడేది ఎవరిపై? పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. కొత్త మంత్రులు క్యాబినెట్లో కొలువుదీరనున్నారు. అయితే ఉగాదికి ఏపీలో సైతం కొత్త మంత్రులు వస్తారని ప్రచారం సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు.
Also Read : పవన్ కి పెద్ద తలనొప్పిగా మారిన నాగబాబు..టీడీపీ, వైసీపీ ఏకం అయ్యాయిగా!
* కొద్ది రోజుల కిందట ప్రకటన
కొద్ది రోజుల కిందట ఏపీ క్యాబినెట్ లోకి( Ap cabinet ) మెగా బ్రదర్ నాగబాబును తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాజ్యసభ పదవుల పంపకంలో అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి. నాగబాబుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయనకు మంత్రి పదవి ద్వారా సర్దుబాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అన్నట్టుగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు నాగబాబు కోసమే మంత్రివర్గ విస్తరణ చేపడతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఏపీ క్యాబినెట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉండబోతున్నారన్నమాట. సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయన కుమారుడు లోకేష్ కీలక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరుడు నాగబాబు మంత్రివర్గంలోకి వస్తున్నారు.
* నాగబాబు ఒక్కరైతే కష్టం..
అయితే నాగబాబు( Nagababu) ఒక్కరినే మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే విమర్శలు వస్తాయని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే ఓ ఐదుగురు ఆరుగురితో మంత్రివర్గ విస్తరణ జరిగితే.. ఏ బాధ ఉండదన్నది ఒక అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలుకుతారని ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఇద్దరు, రాయలసీమ జిల్లాలకు చెందిన ఓ ఇద్దరు, గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి పనితీరు పరంగా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. వారిని మంత్రివర్గం నుంచి తొలగించి.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. కేవలం నాగబాబును దృష్టిలో పెట్టుకునే వీరి మార్పు జరుగుతున్నట్లు అంతటా టాక్ ఉంది.
* ఏడాది కాకమునుపే
అయితే ఏడాది కాకమునుపే మంత్రివర్గ విస్తరణ అంటే సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడే వారు ఉన్నారు. సవ్యంగా సాగుతున్న మంత్రివర్గాన్ని కదిలించరని.. అలా కదిలిస్తే సామాజిక, రాజకీయపరంగా చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారని.. చేజేతులా ఆ అవకాశం ఇవ్వరని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read : అయ్యా చంద్రబాబు గారు.. ఇంకెప్పుడయ్యా?