YS Jagan : ఉగాది( Ugadi) సమీపిస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిలో చలనం లేదు. ఉగాది తర్వాత జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తీరా పండుగ సమీపిస్తున్నా..అందుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు రావడం లేదు. కనీసం కసరత్తు ప్రారంభించడం లేదు. దీంతో ఉగాది తర్వాత జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయా? ఉండవా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి జగన్ జనంలోకి వస్తారని గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే జగన్ పర్యటనలకు సంబంధించి సొంత పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే రావాలని కొందరు.. మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిదని మరికొందరు.. ఇలా ఎవరికి వారుగా తమ అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : అవి మొత్తం రిషబ్ పంత్ కు తెలుసు..
* ఓటమి నుంచి బయటపడిన తర్వాత
ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ). కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే ఒక రకమైన ఆందోళన కనిపించింది. దారుణ పరాజయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి బయటపడ్డారు. తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేయడం ప్రారంభించారు. అదే దూకుడుతో త్వరలో జిల్లాల పర్యటన ఉంటుందని సంక్రాంతికి ముందే ప్రకటించారు. ప్రజల్లోకి బలంగా వస్తానని.. సహకరించాలని పార్టీ శ్రేణులను కోరారు.
* ఉత్తరాంధ్ర నుంచి అంటూ ప్రచారం
అయితే ఉగాదికి తరువాత అంటూ కీలక ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). సెంటిమెంట్ ప్రకారం ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటన మొదలు కాబోతుందని చెప్పుకొచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారానికి మూడు రోజులపాటు పర్యటిస్తానని.. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తను కలిసి అభిప్రాయాలను సేకరిస్తానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన జోష్ వచ్చింది. అయితే ఈ ప్రకటనలు మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. ఉగాదికి పట్టుమని రెండు రోజులు కూడా లేదు. కానీ పార్టీ తరఫున జిల్లాల పర్యటనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరగడం లేదు. కనీసం ప్రకటన కూడా లేదు.
* ఆ అనుమానం తోనే..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా నియోజకవర్గాల్లో ఫుల్ సైలెంట్ లో ఉన్నాయి. కీలక నియోజకవర్గాల్లో ఇన్చార్జులు ప్రజలకు ముఖం చూపడం లేదు. సొంత పార్టీ శ్రేణులను కూడా కలవడం లేదు. ఇటువంటి సమయంలో జగన్ జిల్లాల పర్యటనకు వస్తే సక్సెస్ అనేది అనుమానమే. పైగా కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. అరెస్టుల పర్వం సైతం నడుస్తోంది. నేతలు నగరానికి పరిమితం అవుతున్నారు. నియోజకవర్గాల ముఖం చూడడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.
Also Read : విశాఖలో సామాజిక వర్గ ఈక్వేషన్ లో జగన్!