మెగా కుటుంబం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నటుడు వరుణ్ తేజ్. పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఓ ప్రతిభావంతుడైన దర్శకుడితో మొదటి సినిమా చేశాడు. కానీ, అక్కడి నుంచి తనదైన శైలిలో కెరీర్‌ను నిర్మించుకుంటూ వెళ్తున్నాడు వరుణ్. తొలి సినిమా ‘ముకుంద’తోనే నటనతో మెప్పించిన అతను రెండో సినిమా ‘కంచె’తో తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నాడు. అక్కడి నుంచి ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ ఆరేళ్లలో అతను తొమ్మిది సినిమాలు చేస్తే కేవలం ఒక్కటి (మిస్టర్) మాత్రమే డిజాస్టర్ అయింది. కంచె, ఫిదా, ఎఫ్2, గద్దలకొండ గణేష్ సూపర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా గద్దలకొండలో అయితే తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లాడు వరుణ్. ఈ విజయం ఇచ్చిన ఊపుతో జోరు పెంచాడు. పలువురు దర్శకులకు కమిట్మెంట్ ఇచ్చాడు.
Also Read: గొప్పతనంలో మెగాస్టార్.. మె..గా..స్టా..రే ?
ప్రస్తుతం ‘బాక్సర్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న ఈ మెగా హీరో తర్వాత ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 చేయాల్సి ఉంది. కానీ, కరోనా దెబ్బకు అతను వేసుకున్న ప్రణాళికలు తలకిందులయ్యాయి. ఈ నెలలో ‘బాక్సర్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని అనుకున్నా అది కుదరడం లేదు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కోసం అమెరికాలో బాక్సింగ్ మెళకువలు నేర్చుకున్నాడు వరుణ్. మరోవైపు ఎఫ్3 కి కూడా అనిల్ రావిపుడి కథ, కథనం సిద్ధం చేసి ఉంచాడు. అలాగే, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్రతో కూడా ఓ చిత్రానికి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. కానీ, బాక్సర్ మొదలవడం, ఎఫ్3 లైన్లో ఉండడంతో దాన్ని పక్కనపెట్టారని అనుకున్నారు. కానీ, సాగర్ చెప్పిన కథ నచ్చడంతో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నాగబాబు కొడుకు ఫిక్సయ్యాడు.
Also Read: లెజెండరీ సింగర్ కరోనాని జయిస్తున్నారు !
బాక్సర్, ఎఫ్3 తర్వాత సాగర్ చంద్రతో పని చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. మరోవైపు ‘ఆహా’ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సాగర్ చంద్ర దాని తర్వాత ఓ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాడట. ఆ లోపు బాక్సర్, ఎఫ్3 పూర్తయితే వరుణ్‌ను డైరెక్ట్ చేయాని ప్లాన్ వేసుకున్నాడు. ఇందుకు వరుణ్ కూడా రెడీగా ఉన్నాడని సమాచారం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఎఫ్3 ఆలస్యం అయితే, ముందుగా సాగర్ తో సినిమాను పట్టాలెక్కించాలని మెగా హీరో చూస్తున్నాడట. అవసరం అయితే ఒకే టైమ్‌లో రెండు, మూడు ప్రాజెక్టుల్లో నటించడానికి డేట్స్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టిన వరుణ్ ..కరోనా తగ్గిన వెంటనే బిజీగా మారబోతున్నాడు. ఒకదాని వెంట మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Varun tej puts three directors on the line
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com