Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన ప్రతి సినిమా మీద మంచి బజ్ అయితే ఉంటుంది. గత 50 సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా చాలా మంది యంగ్ హీరోలకు పోటీని ఇస్తు భారీ సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక రీసెంట్ గా అనిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక అదే ఊపులో చిరంజీవి సినిమాను కూడా సూపర్ సక్సెస్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : హీరో నితిన్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి!
ఇక ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి అయింది అంటూ రీసెంట్ గా అనిల్ రావిపూడి ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు…చిరంజీవి గారిని ‘నా కథలో శంకర్ వరప్రసాద్ ను పరిచయం చేశాను. He loved & enjoyed throughly ఇంకెందుకు లేటు త్వరలో ముహూర్తంతో చిరి నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం’ #Chiruanil అంటూ పోస్ట్ పెట్టాడు…
మొత్తానికైతే అనిల్ రావిపూడి చిరంజీవి తో ఏదో భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా సినిమా ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తుంది అనేది…ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు. తద్వారా ఆయన ఎలాంటి రికార్డు ను కొల్లగొడుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లందరు చిరంజీవి తో సినిమా చేయాలని చూస్తున్నారు.
ఆయన మాత్రం కొంతమందితోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు ఆయన సూపర్ హిట్స్ అందుకున్నాడు కానీ ఇప్పుడు భారీ సక్సెస్ లను మాత్రం అందుకోలేకపోతున్నాడు…ఇక ఇప్పుడు ఆయన యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ భారీ విజయాలను సాధించి ఒకప్పటి సక్సెస్ ల పరంపరను మరోసారి కొనసాగించాలని చూస్తున్నారు…
Also Read : పెద్ది’ టీజర్ విడుదల ఇప్పట్లో లేనట్టే..కారణం ఏమిటంటే!