Chiranjeevi and Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు… ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సైతం గత 50 సంవత్సరాలుగా మెగాస్టార్ గా కొనసాగడమే కాకుండా ప్రేక్షకులందరికి ఎలాంటి సినిమాలు కావాలో అలాంటి సినిమాలు అందించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని రంగంలోకి దిగుతున్నాడు. అయితే ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఆరు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలనే ఉద్దేశ్యంలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధిస్తాడా? ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి ఈ సినిమాలో ఒక ఇద్దరు స్టార్ హీరోలతో క్యామియో రోల్స్ ను పెట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరు వెంకటేష్ కగా, మరొకరు రజనీకాంత్.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
వీళ్ళు చిరంజీవి సినిమాలో ఉంటే ఆ కిక్కు వేరేలా ఉంటుందనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక రజినీకాంత్ చేసిన జైలర్ (Jailer) సినిమాలో శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ ఇద్దరు క్యామియోలు పోషించారు. వాళ్ళిద్దరూ పోషించిన పాత్రలకు చాలా మంచి గుర్తింపు రావడమే కాకుండా వాళ్ళు వచ్చిన ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.
మరి ఆ రేంజ్ లోనే ఈ సినిమాలో కూడా వెంకటేష్, రజనీకాంత్ లను ఇన్వాల్వ్ చేసి సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి అయితే వీళ్ళు అనుకున్నట్టుగా ఈ కామ్యూల్ వర్కౌట్ అవుతాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
మొత్తానికైతే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఒక కమర్షియల్ కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం ఒక గొప్ప సినిమాగా నిలిచిపోతుందంటూ అనిల్ రావిపూడి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!