Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అనే వార్త వచ్చినప్పుడే అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు చేస్తున్నాడంటే, ఆ చిత్రానికి ఏర్పడే బజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అలాంటిది ‘సంక్రాంతికి వస్తున్నాం'(Victory Venkatesh) లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న అనిల్ రావిపూడి సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు నేడు రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్(Allu Aravind), దిల్ రాజు(Dil Raju) వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత దిల్ రాజు యాక్షన్ చెప్పగా, విక్టరీ వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. అనంతరం వెంకటేష్, చిరంజీవి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. వీళ్లిద్దరు ఏమి మాట్లాడుకున్నారు అనేది బయటకు రాలేదు కానీ, లెజెండ్స్ గా పిలవబడే ఈ ఇద్దరు అంత సన్నిహితంగా మాట్లాడుకోవడం పై ఇరువురి హీరోల అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో వెంకటేష్ సెకండ్ హాఫ్ లో ఒక కీలక పాత్రలో కనిపిస్తాడట. ‘చిరు నవ్వుల పండుగ’ అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టేందుకు పరిశీలిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పల్లెటూరి నేపథ్యం లో తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇది చిరంజీవి 157 వ చిత్రం అని తెలుస్తుంది.
ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ‘విశ్వంభర’ చిత్రం ఆయన 157 వ చిత్రంగా గతంలో మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమాని కూడా అదే విధంగా ప్రకటించారు. అంటే ‘విశ్వంభర’ కంటే ముందు ఈ చిత్రమే విడుదల కాబోతుందా?., అదే కనుక నిజమైతే అభిమానులు పండుగ చేసుకోవచ్చు. ఎందుకంటే ‘విశ్వంభర’ చిత్రం పై అభిమానుల్లో అంచనాలు పెద్దగా లేవు, టీజర్ లో చూసిన నాసిరకపు గ్రాఫిక్స్ ని చూసి అభిమానులు ఈ చిత్రం పై ఆశలు వదిలేసుకున్నారు. ముందుగా ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ కోసం వాయిదా వేశారు. మళ్ళీ కొత్త విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. లెక్క ప్రకారం ఉగాది కానుకగా ఈరోజు విడుదల తేదీని ప్రకటించాలి, అలా జరగలేదంటే ఇప్పట్లో ఈ సినిమా లేదని అర్థం.
Victory @VenkyMama
Clapped for @KChiruTweets at #MEGA157 pooja ceremony #ChiruAnil #Chiranjeevi #AnilRavipudi #VenkateshDaggubati #PopperStopTelugu pic.twitter.com/EPSB42uZJm— Popper Stop Telugu (@PopperstopTel) March 30, 2025