Chiranjeevi-Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు సైతం 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ కి రెడీ అయిన నేపథ్యంలో ఇప్పుడు ‘అనిల్ రావిపూడి’ (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆ సినిమా ఈరోజు ఉగాది సందర్భంగా ముహూర్తం జరుపుకుంది. మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ధోరణి లోనే ఇప్పటికే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : ‘చిరు నవ్వుల పండుగ’.. ఓ భార్యాభర్తల కథ.. అనిల్ రావిపూడి ప్లానింగ్ అదుర్స్!
మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక విషయం అయితే బయటకు వచ్చింది. అది ఏంటి అంటే ఈ సినిమాలో చిరంజీవి ఒక మాఫియా డాన్ గా కనిపిస్తూనే కమర్షియల్ గా ప్రేక్షకులను నవ్విస్తూ తన సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తారట. ఇక ఇప్పటివరకు చిరంజీవి మాఫియా డాన్ గా ఫుల్ లెంత్ రోల్ ఏ సినిమాలోను పోషించలేదు.
కాబట్టి ఈ సినిమా అనేది చాలా స్పెషల్ గా ఉండబోతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేస్తే 8 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన అనిల్ రావిపూడి ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాన్ని అందుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న క్రమంలో చిరంజీవి సైతం యంగ్ హీరోలకి పోటీని ఇస్తూ చాలా తొందరగా సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా సాంగ్ 2026 సంక్రాంతి కానుకగా బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : వెంకటేష్, ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా!