Chiranjeevi and Anil Ravipudi : ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam Movie) లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ఒక సినిమా చేయబోతున్నాని అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ లాక్ అయ్యిందని, ఈ చిత్రం లో చిరంజీవి గారి పేరు ‘శంకర్ వరప్రసాద్’. మన అందరికీ తెలిసిందే కామెడీ టైమింగ్ లో చిరంజీవి ని మించిన హీరో మరొకరు లేరని. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ లోని కామెడీ టైమింగ్ పెద్దగా బయటపడలేదు. ‘వాల్తేరు వీరయ్య’ లో కామెడీ టైమింగ్ పర్వాలేదు అనిపించినా, అది మెగాస్టార్ రేంజ్ కాదు అనే చెప్పాలి. అందుకే అనిల్ రావిపూడి చిరంజీవి లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాడు. చిరంజీవి స్క్రిప్ట్ న్యారేషన్ సమయంలోనే పగలబడి నవ్వుకున్నాడట. ఇకపోతే ఈ సినిమా ప్రారంభోత్సవం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రేపే జరగబోతుందని టాక్.
రామానాయుడు స్టూడియోస్(Rama Naidu Studios) లో జరగబోతున్న ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడట. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ నెలలో ఆయనకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవుతాయట. వచ్చే నెలలో ఆయన పూర్తిగా మేక్ ఓవర్ చెంది జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అట. ఇందులో మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు, ఆయన మార్క్ హీరోయిజం కూడా ఉంటుందని, గ్యాంగ్ లీడర్ తరహా క్యారక్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు. రేపు ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా, రేపే ఈ ప్రాజెక్ట్ గురించి మరికొన్ని వివరాలను తెలియచేయనున్నారు మేకర్స్. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా అదితి రావు హైదరీ, భూమిక నటించబోతున్నట్టు తెలుస్తుంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కూడా అదే రేంజ్ విజయం సాధించాలంటే కచ్చితంగా సంక్రాంతికే విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు మేకర్స్. మరోపక్క చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రాఫిక్స్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ టీజర్ విడుదల సమయంలో గ్రాఫిక్స్ చీప్ క్వాలిటీ తో ఉన్నాయని అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద రచ్చ చేసారు. దానిని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్ VFX పై రీ వర్క్ చేయిస్తున్నారు. అందుకే విడుదల విషయంలో జాప్యం జరిగిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.