Gangula Kamalakar
Gangula Kamalakar: కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ… మలిదశ తెలంగాణ ఉద్యమానికి కూడా ఊపిరులూదింది కరీంనగరే. కేసీఆర్ ఆమరణ దీక్ష మొదలు పెట్టింది కూడా ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కరీంనగర్.. వరుసగా మూడు ఎన్నికల్లో గంగుల కమలాకర్కే పట్టం కట్టింది. నాలుగోసారి గెలుపుపై కాస్త ఆశలు సన్నగిల్లాయి. 2018లోనే అతి కష్టం మీద గెలిచారు. నాడు బీజేపీ అభ్యర్థిగా ఉన్న బండి సంజయ్ గట్టి పోటీ ఇచ్చారు. కానీ కరీంనగర్‌లోని మైనారిటీ ఓట్లు పూర్తిగా గంగుల కమలాకర్కే పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి మైనారిటీ ఓట్లు చీల్చకపోవడంతో గంగుల బయటపడ్డారు. కానీ ఈసారి అలా ఉండదని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
మాస్ లీడర్..
కరీంనగర్ అంటేనే మాస్.. ఇక్కడి నేతలు కూడా మాసే. బండి సంజయ్, గంగలు కమలాకర్ మళ్లీ ఈ ఎన్నికల్లోనూ తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి పురుమల్ల శ్రీనివాస్‌కు టికెట్ దాదాపు ఖరారైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గంగులలో టెన్షన్ మొదలైంది.ముగ్గురూ మున్నూర్ కాపు సామాజికవర్గానికి చెందిన వారే. గంగుల, బండి పట్టణంలోని మైనారిటీ, హిందూ ఓటర్లను నమ్ముకున్నారు. ఇక పురుమల్ల శ్రీనివాస్‌కు టికెట్ వస్తే మాత్రం గ్రామీణ ప్రాంత మున్నూర్‌కాపు ఓట్లను చీల్చడం ఖాయం అంటున్నారు. బొమ్మకల్‌కు చెందిన శ్రీనివాస్ రియల్టర్‌గా ఇప్పటికే చాలా మందికి తెలుసు. మరోవైపు మున్నూర్ కాపు సామాజికవర్గంలోనూ పనిచేశారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లోనే ఉన్న శ్రీనివాస్.. ఎనినకల వేళ గంగులతో విభేధించి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో గంగుల కమలాకర్ వెంటనే శ్రీనివాస్‌పై పీడీయాక్ పెట్టించారు.
పురుమల్ల చేతిలో గంగుల జాతకం..
దాదాపు పదేళ్లుగా గంగుల, పురుమల్ల కలిసి బీఆర్ఎస్లో పనిచేశారు. గంగులకు రైట్ హ్యాండ్‌గా ఉన్నారు. భూదందాలో మంత్రికి షేర్ కూడా ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గంగుల గ్రానైట్ దందాపైనా శ్రీనివాస్‌కు మంచి అవగాహన ఉంది. ఆర్థిక విషయాలన్నీ పురుమల్లకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు టఫ్‌గా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక మూలాలతోపాటు అవినీతి గుట్టు కూడా శ్రీనివాస్ విప్పితే గంగుల ఓడిపోవడం ఖాయమంటున్నారు.
‘బండి’కి ఛాన్స్..
మరోవైపు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా మాస్ లీడరే. కరీనంగర్‌లో మైనారిటీల దౌర్జన్యాన్ని ఎదురించే లీడర్ సంజయ్ ఒక్కరే. హిందువులపై ఎక్కడ దాడి జరిగినా అక్కడ క్షణాల్లో వాలిపోతారు. యూత్‌లో సంజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు మున్నూరుకాపు సామాజికవర్గం నేత. దీంతో నగరంలోని మున్నూర్‌కాపు ఓట్లతోపాటు యూత్, హిందువుల ఓట్లు దాదాపుగా సంజయ్‌కే పడతాయని అంచనా వేస్తున్నారు. పాదయాత్ర ద్వారా గ్రామీణులకు కూడా సంజయ్ దగ్గరయ్యారు. దీంతో ఈసారి సంజయ్ కూడా గంగులకు టఫ్ ఇస్తారని తెలుస్తోంది.
‘గంగుల’కు స్వపక్షంలో విపక్షం..
మంత్రి గంగుల కమలాకర్‌పై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఉంది. మాస్ లీడర్ అయినప్పటికీ తన అనుచరులకే మాత్రమే పథకాలు ఇవ్వడం, ప్రజలను పట్టించుకోకపోవడం ఆయనకు మైనస్. ఇక, గంగులపై స్వపక్షంలోనే విపక్షం ఎదురవుతోంది. మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ప్రస్తుత మేయర్ సునీల్‌రావు గంగులపై అసంతృప్తితో ఉన్నారు. సిక్కు నేత అయిన రవీందర్‌సింగ్, గంగుల మధ్య చాలాకాలంగా వైరం కొనసాగుతోంది. ఈసారి ఓడించాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. సునీల్‌రావు వెలమ సామాజికవర్గం నేత. ఈసారి వెలమలకు టికెట్ ఇవ్వాలని వినోద్‌కుమార్‌తో కలిసి బీఆర్ఎస్ అధినేతపై ఒత్తిడి తెచ్చారు. కానీ కేసీఆర్ సిట్టింగులకే టికెట్ ఇచ్చారు. దీంతో బీసీల కింద ఎన్నాళ్లు పనిచేయాలన్న భావనలో ఉన్నారు.
ప్రచారంలో వెరైటీ..
ప్రజా వ్యతిరేకత, సొంత పార్టీ వ్యతిరేకతను గుర్తించిన గంగుల కమలాకర్ ఈసారి గెలిచేందుకు భారీగా డబ్బులు వెదజల్లుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు మీడియాను మచ్చిక చేసుకునేందుకు రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇందులో తనకు అనుకూలంగా లేనివారిక మొండిచేయి చూపారు. ఇక పథకాలన్నీ తన అనుచరులకే ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రచారంలోనూ వెరైటీ చూపుతున్నారు. పాటలు రాయించుకుని, అందులో నటిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మాస్ డ్యాన్స్ కూడా చేశారు. డిప్యూటీ మేయర్ భర్త సల్ల హరిశంకర్, మేయర్ సునీల్‌రావుతో కలిసి సెట్టపులేశారు. ‘కరీంనగర్ అయింది స్మార్ట్ సిటీ.. కరీంనగర్ అయింది స్మార్ట్ సిటీ.. అందుకు కమలాకరన్నే కారణం.. అని హరిశంకర్, గతంలో ఎట్టుండె కరీంనగర్.. గతంలో ఎట్టుండె కరీంనగర్.. ఇప్పుడెట్లయింది చూడండి కరీంనగర్.. అని గంగుల కమలాకర్.. 30వ తారీకు వేలుకు ఉండాలి ఇంకు.. 30వ తారీఖు వేలుకు ఉండాలి ఇంకు.. ప్రతిపక్షాలన్నీ పరార్’ అని మేయర్ సునీల్‌రావుతో బ్యాండు కొట్టి మరీ చెప్పించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. గంగుల కమలాకర్ కాదు.. గంగుల కళాకార్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Variety in gangula kamakars campaign viral video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com