Mr Beast: దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు ఉద్యోగులకు ఏటా దీపావళి సందర్భంగా బోనస్ ఇస్తుంటాయి. ఇక గుజరాత్(Gujarath)కు చెందిన వజ్రాల వ్యాపారి కూడా తన ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ఖరీదైన బైక్‌లు, కార్లు, కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. ఆయనను చూసి మరికొందు కూడా పుట్టిన రోజు, పెళ్లి రోజు, సంస్థల యానివర్సరీ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారు. దీనివెనుక కారణం కూడా ఉంది. ప్రోత్సాహకాలు ఇవ్వడం వలన ఉద్యోగులు ఇంకా బాగా పనిచేస్తారని నమ్ముతారు. సంస్థ అభివృద్ధికి తోప్పడతారని భావిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్(Social Media Influencer) కూడా ఇలాగే తన బర్త్‌డే సందర్భంగా ఖరీదైన టెస్లా కార్లను గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించాడు. అమెరికా(America)కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, ఆన్‌లైన్‌లో మిస్టర్ బీస్ట్‌గా పాపులర్ అయిన జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్‌సన్ యూట్యూబ్‌లో 254 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్స్‌ను కలిగి ఉన్నాడు. సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న మిస్టర్ బీస్ట్ అలియాస్ జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్ సన్.. కూడా తన ఫాలోవర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. తన 26వ పుట్టిన రోజుఏ సందర్భంగా 26 టెస్లా కార్లను గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించాడు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టామ్ర్(Instagram)లో పోస్టు చేశాడు. ఆ పోస్టు కింద కామెంట్ చేసినవారిలో 26 మందిని మిస్టర్ బీస్ట్ సెలక్ట్ చేసి 26 కార్లు బహుమతిగా ఇవ్వనున్నారు.
Also Read: భారీ వేతనంతో జాబ్.. రెజ్యూమ్ కూడా అవసరం లేదు.. ఏం చేయాలంటే..!
మిస్టర్ బీస్ట్‌గానే పాపులర్..
ఇక జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్ సన్ ఆన్‌లైన్‌లో మిస్టర్ బీస్ట్‌గా బాగా పాపులర్ అయ్యాడు. ఒక అమెరికన్ యూట్యూబర్ అయిన సీఫెన్ 254 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైరబర్స్‌ను కలిగి ఉన్నాడు. యూట్యూబ్‌లో అత్యధికమంది సబ్‌స్క్రైబర్స్‌ను కలిగి ఉన్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు. ఆయన 2012 ప్రారంభంలో అంటే 13 ఏళ్ల వయసులో మిస్టర్ బీస్ట్ 6000 పేరిట మొదట ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2(గతంలో మిస్ట్‌ర్ బీస్ట్ షార్‌ట్స), అలాగే దాతృత్వం ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రోపీని నడుపుతున్నాడు.
మోకాళ్లపై ప్రియురాలికి ప్రపోజ్..
ఇక మిస్టర్ బీస్ట్ ఈ ఏడాది జనవరి 1న తన ప్రియురాలికి ప్రపనోజ్ చేశాడు. తన స్నేహితురాలు అయిన థియా బూయ్‌సెన్‌కు ప్రపోజ్ చేసి తన నిశ్చితార్థాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగానే వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియోను కూఆ సోషల్ మీడియా వేదికగానే వెల్లడించాడు. దీంతో ఆయన ఫాలోవర్స్ ఫుల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌పై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా స్పందించారు. అభినందనలు అని ఏమోజీతో ట్వీట్ చేశారు.
Also Read: పెరూలో 16వ శతాబ్దపు వంతెన.. వంతెన వద్ద ఇవి కూడా.. వెలికి తీసేందుకు తవ్వకాలు