Phone Tapping Case
Phone Tapping case : తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలతోపాటు, తమకు అనుకూలంగా లేనివారి ఫోన్లు ట్యాప్ చేయించింది. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)విచారణకు ఆదేశించింది. పోలీసులు ఇప్పటికే విచారణ జరిపి పలువురిని అరెస్టు చేశారు. ఏడాదికాలంగా వారు జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే రాధాకిషన్‌రావుకు హైకోర్టు, తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండీషన్ బెయిల్ ఇచ్చాయి. ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న పెద్దలు ఎవరన్నది మాత్రం ఇప్పటికీ తేలలేదు. ఈ తరుణంలో కేసు విచారణ నత్తనడకనా సాగుతున్న సమయంలో ఆదివారం(ఫిబ్రవరి 16న) ఒక ట్విస్ట్ చోటుచేసుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్(Chakradhar) ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేసిన ఫిర్యాదుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు వేగం పెంచారు. ఓ రైతుకు తెలియకుండా డ్యాకుమెంట్స్‌తో హరీశ్‌రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేసి ఆ సిమ్ వినియోగించి బెదిరింపులకు చక్రధర్‌గౌడ్‌ను బెదిరించాడు. విచారణలో నిర్ధారణ కావడంతో హరీశ్‌రావు పీఏ వంశీకృష్ణతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా ఈనెల 28 వరకు ముగ్గురికి రిమాండ్ విధించారు. ఇదే కేసులో హరీశ్‌రావు ఏ–1గా, రాధాకిషన్‌రావు ఏ–2గా ఉన్నారు.
ప్రణీత్‌రావుకు బెయిల్..
ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రణీత్‌రావుకు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు ఫిబ్రవరి 14న బెయిల్ ఇచ్చింది. ప్రణీత్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రణీత్‌రావు ఏ–2గా ఉన్నారు. ఇదే కేసులో నిందితులగా ఉన్న తిరుపతన్న, ప్రభాకర్‌రావు, భుజంగరావుకు అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరైంది. రాధాకిషన్‌రావుకు హైకోర్టు, తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండీషన్ బెయిల్ ఇచ్చిందని.. ఈ క్రమంలో సంవత్సర కాలంగా చంచల్‌గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రణీత్‌రావుకు కండీషన్ బెయిల్ ఇవ్వాలని కోరడంతో.. వాదనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Big twist in phone tapping case former minister pa arrested
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com