Prabhas and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే బాహుబలి(Bahubali) సినిమాతో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా అవతరించిన ప్రభాస్ (Prabhas)…తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఆయన సాధించిన విజయాలు ఒకత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కెరియర్ మొదట్లో రాజమౌళి(Rajamouli)తో ఛత్రపతి(Chatrapathi) సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. మరి ఆ సినిమా రిలీజ్ అయ్యాక ప్రభాస్ రాజమౌళితో గొడవ పెట్టుకున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి ఛత్రపతి సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా నా వల్ల సక్సెస్ అయిందని రాజమౌళి అంటే లేదు నా వల్ల సక్సెస్ అయిందని ప్రభాస్ అన్నాడు. దాంతో ఇద్దరు కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ ని నిర్వహించారు. ఇక అందులో ఎవరు గెలిస్తే వల వల్లే ఆ సినిమా సక్సెస్ అయింది అని అవతలి వాళ్ళు ఒప్పుకోవాలి అనే నిబందనలు పెట్టుకొని మ్యాచ్ ఆడారు. అందులో ఎవరు గెలిచారు అనే విషయం పక్కన పెడితే దాని ద్వారా వచ్చిన కొన్ని డబ్బులను ఒక సేవా సంస్థకు అందించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి ఒక ఫేక్ గొడవను సృష్టించి మరి క్రికెట్ ఆడి వాళ్లకు డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Also Read : ప్రభాస్ రాజమౌళి గొడవ పెట్టుకోవటానికి కారణం ఎవరు..?
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ప్రభాస్ ఇద్దరు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడం విశేషం. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తుంటే ‘హను రాఘవపూడి’ దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయాల్సిన ‘స్పిరిట్’ సినిమాని తెరకెక్కించే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే మారుతితో చేస్తున్న రాజాసాబ్ సినిమా కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ చాలా బిజీగా ఉండే విధంగా కెరియర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా సంవత్సరానికి రెండు సినిమాల చొప్పున రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…