Pilot Rohit Reddy : తాండూరు మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి నాయకుడు పైలెట్ రోహిత్ రెడ్డి అరెస్టు అయ్యారని మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఆయనను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారని, ప్రస్తుతం ఆయన దుబాయ్ పోలీసుల అదుపులో ఉన్నారని మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన అరెస్టు అయ్యారా? దుబాయ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఆయన దుబాయ్ ఎందుకు వెళ్లారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అరెస్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు..” అందరికీ నమస్కారం. నా అరెస్టుపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. నన్ను ఎవరూ అరెస్టు చేయలేదు. నేను దుబాయ్ వెళ్లలేదు. నన్ను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారని మీడియా, సోషల్ మీడియా లో వస్తున్న వార్తలో నిజం కాదు. నేను హైదరాబాదులోని మణికొండలో నా ఇంట్లో ఉన్నాను. కావాలంటే చూడండి.. తెలంగాణ ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు” అని ఆ వీడియోలో రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read : ఆఖరి సీఎం అయినా ఫర్వాలేదట.. రేవంత్ రెడ్డికి అసలు కథ అర్థమవుతోందా?
సోషల్ మీడియాలో ప్రశ్నలు
రోహిత్ రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేసిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో కొంతమంది ఆయనను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ” దుబాయ్ పోలీసులు అరెస్టు చేయలేదు సరే.. మీరు మణికొండ లో ఉన్నారు సరే…మీ పాస్ పోర్ట్ ఎక్కడ? ముందు దాన్ని చూపించండి? ఇన్నాళ్లపాటు మీరు వార్తల్లో లేరు.. తాండూరులో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇన్నాళ్లు లేనివి ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీడియాకు మీ మీద కోపం లేదు కదా? కావాలని మీరు అరెస్టు కాకున్నా, అరెస్టు అయ్యారని చెప్పదు కదా? అంటే దాల్ మే కుచ్ కాలా హై అనే సామెత గుర్తుకు వస్తోందని” నెటిజన్లు నిలదీస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రోహిత్ రెడ్డి తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిలో చేరారు. కేసీఆర్ కు అత్యంత దగ్గర వ్యక్తిగా మారిపోయారు. అప్పట్లో మొయినాబాద్ ఫామ్హౌస్ ఎపిసోడ్ లో రోహిత్ రెడ్డి పాత్ర కీలకంగా వినిపించింది. అయితే ఆ కేసులో కెసిఆర్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ కేసులో పస లేకపోవడంతో సిట్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఈ కేసులోకి సిబిఐ ఎంటర్ అయింది. అనంతరం కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది. 2023 ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ టికెట్ కెసిఆర్ రోహిత్ రెడ్డికే ఇచ్చారు. రోహిత్ రెడ్డి ఆ స్థానంలో ఓడిపోయారు. నాటి నుంచి మీడియాకు కాస్త దూరంగానే ఉంటున్నప్పటికీ..ఇప్పుడు ఆయన అరెస్టుకు సంబంధించిన వార్త మీడియాలో వస్తుండడం సంచలనం కలిగిస్తున్నది.
నన్ను దుబాయిలో అరెస్ట్ చేశారని కొన్ని వార్త కథనాలు వస్తున్నాయి..
అందులో ఏ మాత్రం వాస్తవం లేదు..
నేను ఇప్పుడు హైదారాబాద్ మణికొండలోని నా ఇంట్లో ఉన్నాను.. తప్పుడు ప్రచారం నమ్మవద్దు..
– తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి#Telangana #RohitReddy #LatestNews #RTV pic.twitter.com/6Wq7elExLq— RTV (@RTVnewsnetwork) February 26, 2025