Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సిద్ధయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి శుభయోగాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సలహా తీసుకొని వ్యాపారాలు పెట్టబడులు పెట్టాలి. చిన్న వ్యాపారాలు కొత్త వ్యక్తులను నమ్మొద్దు. ప్రయాణాల వల్ల నష్టాలు ఉండే అవకాశం. అందువల్ల దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులు నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల ప్రశంసలు పొందుతారు. వీరికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం. వ్యాపారులు భాగస్వాముల మధ్య వాగ్వాదాన్ని ఎదుర్కొంటారు. కొన్ని ఇబ్బందులను బయటపడడానికి కష్టపడతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఆరోగ్యంగా శ్రద్ధ వహించాలి. రాజకీయాల్లో ఉండే వారికి ఈరోజు అనుకూలం. సమాజంలో గుర్తింపు వస్తుంది. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు కుటుంబ వాతావరణ మహోన్నతంగా ఉంటుంది. పాత స్నేహితులు కలవడం వల్ల సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు జరుపకుండా ఉండాలి. కొందరు కుటుంబంలో చిచ్చుపెట్టే అవకాశం. అందువల్ల ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు అదృష్ట వరించడంతో ఊహించనంత లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. కష్టపడి పని చేసిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయవచ్చు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. వివాహానికి సంబంధించి ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుంటారు. భవిష్యత్తులో జరిగే కొన్ని పనుల కోసం ఇప్పటి నుంచే పెట్టుబడును పెడతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరించనుంది. నీతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. సోదరుల మద్దతుతో ఉద్యోగులు కొత్త పెట్టుబడును పెడతారు. తల్లిదండ్రుల అండ ఉండడంతో కొన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఒక పని కోసం బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : వ్యాపారులకు జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. అందువల్ల దుబారా ఖర్చులను నియంత్రించాలి. మానసికంగా ఆందోళనలతో ఉంటారు. ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ అవసరాల కోసం డబ్బులు ఇతరులను వద్ద నుంచి సేకరిస్తారు. అయితే కొందరు ఇబ్బందులు పెడతారు. అందువల్ల అందరిని నమ్మే ప్రయత్నం చేయవద్దు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాజు వారు ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నీతో మానసికంగా ఆందోళన చెందుతారు. ఇతరుల అవసరాలకు డబ్బు సాయం చేస్తారు. యర యాత్రలకు వెళ్లడానికి డబ్బు ఖర్చు చేస్తారు. సీనియర్ల మద్దతుతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అన్నిటిని ఓపికతో పరిష్కరించుకోవాలి. ఏ విషయంలోనైనా కోపాన్ని నియంత్రించుకోవాలి. స్నేహితుల మద్దతుతో వ్యాపారాలు లాభాలు పొందుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మకర రాశి వారికి అకస్మాత్తుగా దన లాభం ఉంటుంది. వ్యాపారులు కొత్త లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అగరపాదాయం చేకూరుతుంది. స్నేహితుల్లో ఒకరు దళ సహాయం చేస్తారు. పెట్టుబడి ప్రణాళికల గురించి తెలుసుకుంటారు. తండ్రి సలహాతోనే కొత్తగా పెట్టుబడును పెట్టడం మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు పూర్తి సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే కొత్త వ్యక్తులను దూరంగా ఉంచాలి. ప్రియమైన వారి కోసం విలువైన బహుమతిని అందజేస్తారు. దీంతో మరింత ప్రేమగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : శత్రువులు తప్పుడు సమాచారాన్ని అందిస్తారు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల నాయకులకు అనుకూలంగా ఉండే సమయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.