IT Companies : గుడిలో మెల్లగా స్టార్టప్ లలో పరిస్థితి మెరుగ్గా ఉందని అనుకుంటుంటే.. అక్కడ కూడా ఇదే దుస్థితి.. పైగా చాలా వరకు అంకుర సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగులను తొలగించడానికి కారణాలు లేకపోతే రకరకాల ఇబ్బందులు పెడుతున్నాయి. వారికి ఉద్యోగం అంటేనే విరక్తి కలిగేలా చేస్తున్నాయి. చివరికి వారు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఉదంతాలు ఇటీవల చాలా చోటుచేసుకున్నాయి. ఓ స్టార్టప్ కంపెనీలో పని చేస్తున్న ఓ వ్యక్తి తన 20 రోజుల ఉద్యోగ జీవితం గురించి రెడిట్ లో పంచుకున్నాడు. అతనికి ఏదైనా అనుభవాల గురించి రాసుకొచ్చాడు. ఇప్పుడు అది సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.
నరకం చూపించారు
ఆ వ్యక్తి సొంత గ్రామం హర్యానాలోని గుర్ గ్రామ్. ప్రాంగణ ఎంపికల్లో భాగంగా అతడు ఒక అంకుర సంస్థలో ఉద్యోగం సాధించాడు. ప్రొహిబిషనరీ పీరియడ్ కావడంతో ఆ కంపెనీ తక్కువగానే జీతం ఇస్తానని చెప్పింది. బయట మార్కెట్లో పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ వ్యక్తి దానికి ఒప్పుకున్నాడు. సంస్థ చెప్పిన తేదీకి ఉద్యోగంలో చేరాడు. నాటి నుంచి అతడు ఒళ్ళు వంచి పని చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ అతని మీద నిందలు పడుతూనే ఉన్నాయి. ఉద్యోగంలో చేరిన మూడో రోజు నుంచే అతనిపై ఎండలు వేయడం మొదలుపెట్టారు. అతడు వినయంతో లేడని.. క్రమశిక్షణ పాటించడం లేదని.. నలుగురితో కలవలేడని విమర్శలు మొదలుపెట్టారు. అతడు నలుగురితో కలిసి పని చేస్తున్నప్పటికీ లేనిపోని మాటలు అనేవారు.. చివరికి అతడు టీ తాగడానికి బయటకు వెళ్లినప్పటికీ కూడా సహించేవారు కాదు. గుంపులుగా వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేసేవారు.. ఇక సంస్థలో పని పూర్తికాగానే .. ఇంటికి వెళ్తుంటే.. దానిని కూడా వారు సమస్యగానే చూసేవారు. ఇక అతడు ఉద్యోగంలో చేరి 20వ రోజు వచ్చేసరికి డెస్క్ లో పనిచేయదని.. డైరెక్టర్ క్యాబిన్లో పనిచేయాలని సూచించారు. ఉద్యోగం అవసరం కావడంతో అతడు దానికి కూడా అంగీకరించాడు. ఇక సాయంత్రం ఏడు గంటలకు పూర్తికాగానే తన సహ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా అతడు క్యాబిన్ వైపు చూశాడు. దానికి డైరెక్టర్ కు కోపం వచ్చింది. దీంతో అతని మీద గట్టిగా అరిచాడు. అంతేకాదు ఉద్యోగం నుంచి ఇతడిని తొలగించాలని హెచ్ఆర్ మేనేజర్ కు ఆదేశాలు జారీ చేశారు.. అయితే ఈ విషయాన్ని ఆ వ్యక్తి రెడిట్ లో రాస్కొచ్చాడు. ఇది కాస్త వైరల్ గా మారింది.. అయితే దీనిని చూసిన చాలామంది నెటిజన్లు.. ఆ పనికిమాలిన ఉద్యోగం నుంచి వెళ్లి రావడమే మంచిదని.. గొప్ప నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మరికొందరు పేర్కొన్నారు.. పొమ్మన లేక మీకు పొగ పెట్టారని.. అలాంటి సంస్థలో పనిచేయకపోవడమే మంచిదని ఇంకొందరు వ్యాఖ్యానించారు.
Also Read : హైదరాబాద్ 100 కోట్ల భారాన్ని”ఐటీ కంపెనీలు’ మోయగలవా?