Pre- Wedding Shoot In Grave: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందంటారు. లోకంలో విచిత్రమైన మనుషులున్నారు. వారి ఆలోచనలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందరు ఆలోచించినట్లు చేస్తే ఏం ఉంటుంది మజా. మన స్టైలే వేరు అంటూ విచిత్రమైన మనోభావాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలతో ఔరా అనిపించుకుంటున్నారు. ఇలాంటి వారు కూడా ఉంటారా? అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. వారు చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. లోకంలో విభిన్న మనస్తత్వాలు ఉన్న వారు ఉండటం సహజమే. కానీ ఎక్కడ ఎవరు చేయని పనులు చేస్తూ అందరిలో ఆలోచనలు పెంచుతున్నారు.

జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి అందరికి ఎన్నో కలలు ఉంటాయి. తమకు కాబోయే జీవిత భాగస్వామి గురించి ఇరువురు ఎన్నో ఊహలు కంటుంటారు. భవిష్యత్ ఎలా ఉండబోతోందనే దానిపై కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. తమకు కలగబోయే అదృష్టం గురించి ఎన్నో ఊసులు పెంచుకుంటారు. జీవితాంతం తోడు నీడగా వచ్చే వారి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. అలాంటి పెళ్లిని కూడా ప్రస్తుతం కొత్తగా చేసుకుంటున్నారు. కాబోయే భార్యాభర్తలు బంధువులందరి సమక్షంలో ఎంతో వైభవంగా వివాహం చేసుకోవడం అందరు చేస్తుండేదే.
Also Read: Prabhas Fans: పవన్ – చిరు ఫాన్స్ ని టార్గెట్ చేసిన ప్రభాస్ ఫాన్స్
సమాధి తవ్వుకుని అందులో పడుకుని వెడ్డింగ్ షూట్ గా భావించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాబోయే వధూవరులు వేదిక మీద నిలబడి నవ్వుతూ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. కానీ వారు మాత్రం విభిన్నంగా ఆలోచించి తమ వేడుకను ఓ సమాధిలో జరుపుకోవాలని భావించడం అందరిలో ఎన్నో అనుమానాలకు దారి తీసింది. అన్నిటికంటే ప్రశాంతమైన స్థలం సమాధి అని అందరు అనుకోవడం కొత్తేమీ కాదు. సమాధినే తమ వివాహ వేదికగా చేసుకుని వారు ఫొటో కూడా దిగడం అందరిలో ఆలోచనలు పెంచుతోంది.

ఆ భార్యాభర్తలు సమాధి తవ్వించుకుని అందులో వారు పడుకుని ఫొటో తీసుకున్నారు. ఇదే తమ వివాహ వేదికగా పరిచయం చేసుకుంటున్నారు. జీవిత చివరి అంకంలో అందరు ఇక్కడే పడుకుంటారు. దీంతో ఇప్పుడే ఇలా చేస్తే ఎలా ఉంటుందోననే కోణంలో వారి ఆలోచన ఓ కొత్త మార్గానికి బాటలు వేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి వినూత్న పద్ధతి కోసం వారు సమాధినే తమ కార్యక్రమ వేదికను చేసుకోవడం ఆలోచనలు రేకెత్తిస్తోంది. మినీ హెడ్స్ మెనీ మైండ్స్ అనే ఆంగ్ల సామెత ప్రకారం సమాధినే తమ వెడ్డింగ్ మాల్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Pawan Kalyan- Chiranjeevi: పవన్ కళ్యాణ్ సీఎం అయితే చిరంజీవికి ఆ పదవి ఇస్తాడట