Vijayasai Reddy: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న నేతల్లో వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ముందుంటారు. అటు విపక్షాలపై విమర్శలు గుప్పించడంలో ముందుంటారు. అయితే ఇటీవల కేంద్ర పెద్దలకు పొగడ్తలకే ట్విట్టర్ ఖతాను అధికంగా వినియోగిస్తున్నారు. రకరకాలుగా పొగడ్తల బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు తెలుగు సినిమాలకు ఎటువంటి గౌరవం దక్కినా వారికి ఇట్టే తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొన్న అల్లు అర్జున్ పుష్ప యూనిట్ కు ప్రశంసలతో ముంచెత్తారు. నిన్న చిరంజీవి గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఏపీలో నిర్వహిస్తున్నట్టు చిరంజీవి ప్రకటించగానే తన ట్విట్టర్ కు పనిపెట్టారు. చిరంజీవిని అభినందించారు. అయితే ఉన్నట్టుండి ఆయన తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కలకలం చోటుచేసుకుంది. అయితే అక్కడే ఒక షరతు విధించారు. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ రాకపోతే ముందుగా తానే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ అధ్యక్షతన ఇటీవల సమావేశం నిర్వహించారు. ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలోని అధికారు బృందం హాజరైంది. అయితే ఏపీ అధికారులు విభజన సమస్యలతో పాటు విశాఖ రైల్వేజోన్ విషయం ప్రస్తావించారు. కానీ విశాఖ రైల్వేజోన్ లాభదాయం కాదని.. ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే అధికారులు తేల్చిచెప్పినట్టు వార్తలు వచ్చాయి. అందుకే డీపీఆర్ సైతం రూపొందించలేదన్న టాక్ నడిచింది.
Also Read: Prabhas- YCP MLA: ప్రభాస్ తో వైసీపీ ఎమ్మెల్యే కీలక భేటీ – ఇదిగో ఆధారాలు
పత్రికలు, మీడియాలో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. హోదా మాదిరిగా మరో విభజన హామీ రద్దు పద్దులోకి వెళ్లిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అటు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా నెటిజెన్లు ట్రోల్ చేశారు. సీఎం జగన్ కేంద్ర పెద్దలు కలిసింది వ్యక్తిగత ప్రయోజనాలకు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కాదని విపక్షాలు ఆరోపించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో కలవరం ప్రారంభమైంది.

అయితే దీనిపై ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు చక్కబెట్టే ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఇదంతా టీడీపీ అనుకూల మీడియా కుట్రగా అభివర్ణించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించకపోతే తన పదవిని తృణప్రాయంగా విడిచిపెడతానని కూడా ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే చంద్రబాబు ఆడిన నాటకంగా రోటిన్ డైలాగు చెప్పారు. చాలాసార్లు వైసీపీ ఎంపీల బృందం రైల్వే మంత్రికి, ఉన్నతాధికారులకు విన్నవించామని.. వారు సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు.విభజన హామీల్లోనే రైల్వే ప్రత్యేక జోన్ ఉందని చెప్పారు. అయితే దీనిపై కేంద్ర రైల్వే సహాయ మంత్రితో ప్రకటన ఇప్పించారు. హోంశాఖ నిర్వహించిన సమీక్షలో రైల్వేజోన్ అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పించారు. అయితే దీనిపై కూడా నెటిజన్లు షటైర్లు వేస్తున్నారు. విభజన హామీల్లో రైల్వే ప్రత్యేక జోన్ లేదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తనకు అలవాటు అయిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ, దాని అనుకూల మీడియా పై నెపం వేస్తున్నారు.
Also Read: Pawan Kalyan- Chiranjeevi: పవన్ కళ్యాణ్ సీఎం అయితే చిరంజీవికి ఆ పదవి ఇస్తాడట
[…] Also Read: Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజీనామా అస్త్… […]