spot_img
Homeట్రెండింగ్ న్యూస్Uber Cab Driver: పాకిస్తానోడికి ఇచ్చి పడేసిన భారతీయ క్యాబ్‌ డ్రైవర్‌.. భారత్‌ జోలికొస్తే అంతే...

Uber Cab Driver: పాకిస్తానోడికి ఇచ్చి పడేసిన భారతీయ క్యాబ్‌ డ్రైవర్‌.. భారత్‌ జోలికొస్తే అంతే మరి!

Uber Cab Driver: భారత దేశం సర్వ మతాల సమ్మేళనం. విదేశీయులు కూడా వివిధ పనుల నిమిత్తం వచ్చి భారత దేశంలో ఉంటున్నారు. పాకిస్తానీలు కూడా అనుమతితో మన దేశంలోని వివిధ రాష్ట్రాలో ఉన్నారు. ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇక మెట్రో నగరాలు అయిన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో నిత్యం అనేక ఘటనలు జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ పాకిస్థానీ పౌరుడు తన స్నేహితురాలితో క్యాబ్‌ ఎక్కాడు. మధ్యలో వచ్చాక ఆమెను ఇంపేశాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో కారులో కూర్చున్న వ్యక్తి పాకిస్తాన్‌కు చెందినవాడు. క్యాబ్‌లో కూర్చున్న తర్వాత పాకిస్థాన్‌ వ్యక్తి స్నేహితురాలు క్యాబ్‌ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భారతీయ క్యాబ్‌ డ్రైవర్‌ ఇద్దరినీ మధ్యలో దించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

భారత్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. క్యాబ్‌ డ్రైవర్‌ మొదట ఢిల్లీ, భారతీయుల గురించి మంచి మాటలు చెప్పాడు. కానీ, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి వాటిపై నిరసన వ్యక్తం చేయడమే కాకుండా భరత్‌ను కించపరిచేలా మాట్లాడాడు. భారతీయులను గౌరవించకుండా మాట్లాడాడు. అతను భారతీయులను, ఢిల్లీ వాసులను స్వార్ధపరులు అని మాట్లాడాడు. ఈ క్రమంలో గొడవ పెరగడంతో చిర్రెత్తుకొచ్చిన క్యాబ్‌ డ్రైవర్‌ వాహనం పక్కన నిలిపి ఇద్దరినీ కిందకు దించేశాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

ఇది మోదీ దేశం…
ఈ సందర్భంగా క్యాబ్‌ డ్రైవర్‌ కూడా వారితో గట్టిగా వాదించాడు. ఇది నరేంద్రమోదీ దేశం.. పాకిస్తానీల బుద్ధి మారదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు అని కఠినంగా మాట్లాడాడు. ఈ ఘటన ఢిల్లీలో ఎక్కడ, ఏరోజు జరిగిందో తెలియదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. రాత్రి పూట జరిగినట్లు మాత్రం అర్థం అవ్వుతుంది. రాత్రి వేళనే పాకిస్తానీయుడిని, అతని స్నేహితురాలిని మధ్యలో వదిలేసి వెళ్లాడు. అదే సమయంలో అతనికి సపోర్టుగా ఎవరైనా ఉండి ఉంటే పాకిస్తాన్‌ యువకుడి పరిస్థితి దారుణంగా ఉండేది. క్యాబ్‌ డ్రైవర్‌ సహనం వహించడంతోనే అతను బతికిపోయాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. డ్రైవర్‌కు సెల్యూడ్‌ చేస్తున్నారు. దటీజ్‌ ఇండియన్‌.. భారత్‌తో పెట్టుకుంటే అంతే మరి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper