
Sreemukhi: రోజులు మారాయి అన్నట్లు… యాంకర్స్ మారిపోయారు. బాలీవుడ్, హాలీవుడ్ యాంకర్స్ ని కూడా బీట్ చేసేలా స్కిన్ షో చేస్తున్నారు. జబర్దస్త్ యాంకర్స్ అనసూయ, రష్మీ తెలుగులో ఈ సాంప్రదాయం మొదలుపెట్టారు. శ్రీముఖి వంటివారు ఈ సాంప్రదాయం ముందుకు తీసుకెళుతున్నారు. శ్రీముఖి అయితే మరింతగా రెచ్చిపోతున్నారు. స్కిన్ షో చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
సుమ, ఉదయభాను, ఝాన్సీ జనరేషన్ లో యాంకరింగ్ అంటే మాటలు గలగలా పారించడం. ఇప్పుడు దానికి విరుద్ధం. తెలుగు రాకపోయినా పర్లేదు, మొహమాటం లేకుండా స్కిన్ షో చేయాలనే విధంగా మారిపోయింది. ట్రెండ్ ని ఫాలో అవుతూ శ్రీముఖి సక్సెస్ అవుతుంది. ఏకంగా స్కర్ట్స్, మిడ్డీస్, షార్ట్ ఫ్రాక్స్ వేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.

తాజాగా మరోసారి రెచ్చిపోయింది. హాట్ థైస్ చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది. శ్రీముఖి హాట్ అవతార్ చూసి నెటిజెన్స్ టెంప్ట్ అవుతున్నారు. దారుణమైన కామెంట్స్ తో తమ ఫీలింగ్స్ షేర్ చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చెప్పాలంటే తెలుగులో శ్రీముఖి టాప్ యాంకర్ పొజిషన్ కి వెళ్లారు. ఆమె అరడజనుకు పైగా షోలలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు
మరోవైపు నటిగా సక్సెస్ కావాలనుకుంటున్నారు. చిరంజీవి, బాలయ్యల అప్ కమింగ్ చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భోళా శంకర్ లో ఆమె రోల్ చాలా క్రేజీగా ఉంటుందట. ఖుషి మూవీలోని నడుము చూసే రొమాంటిక్ సీన్ చిరు-శ్రీముఖి మీద స్పూఫ్ చేశారట. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎన్బీకే 108లో కూడా శ్రీముఖి ఓ కీలక రోల్ చేస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

శ్రీముఖి సంపాదన నెలకు లక్షల నుండి కోట్లకు చేరిందట. హైదరాబాద్ లో శ్రీముఖి లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ఇటీవల ఫ్యామిలీతో పాటు గృహప్రవేశం చేశారు. శ్రీముఖికి అమ్మానాన్నలతో పాటు తమ్ముడు ఉన్నాడు. తరచుగా శ్రీముఖి పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. వీటిని శ్రీముఖి ఖండిస్తున్నారు. దానికి ఇంకా సమయం ఉంది. కుదిరినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, నిరాధార కథనాలు రాయొద్దంటూ ఆమె మండిపడుతున్నారు.