
Mahesh Babu: టాలీవుడ్ కాంట్రవర్సీలకు దూరం గా ఉంటూ, మచ్చ లేని చంద్రుడిగా పేరున్న హీరో ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే. ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ లో ఒక్క చిన్న ఆరోపణ కూడా మహేష్ మీద లేదు. ఉన్నదాంట్లో నలుగురికి సహాయం చెయ్యడం,ఆ తర్వాత పెళ్ళాం పిల్లలతో ప్రశాంతవంతమైన జీవితం గడపడం, ఇదే ఆయన ప్రపంచం. అంతా బాగానే ఉంది కానీ,మహేష్ బాబు కి ఒక చెత్త అలవాటు ఉందట.
అప్పట్లో ఆయన రోజుకి మూడు నుండి నాలుగు ప్యాకెట్స్ సిగరెట్లు తాగేవాడట. అంటే రోజుకి 40 సిగెరెట్స్ అన్నమాట. అంతలా అడిక్ట్ అయినా మహేష్ ఈ అలవాటు నుండి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసాడు. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు, ఫైనల్ గా ఒక పుస్తకం చదివిన తర్వాత ఆయనకీ సిగరెట్ మీదనే విరక్తి కలిగిందట.రోజుకి నాలుగు ప్యాకెట్ల సిగరెట్స్ తాగే అలవాటు ఉన్న మహేష్ , ఇప్పుడు ఒక్క సిగరెట్ కూడా తాగడం లేదట.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయనకీ ఉన్నన్ని సూపర్ హిట్స్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదని చెప్పొచ్చు. యావరేజి గా ఉన్నా కూడా కలెక్షన్స్ అదరగొట్టేస్తున్నాయి, ఇదే ఆయన సూపర్ స్టార్ స్టేటస్ కి నిదర్శనం అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. గత కొద్దిరోజుల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బ్రేక్స్ లేకుండా సాగుతుంది. ఇందులో పూజ హెగ్డే మరియు శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా , థమన్ సంగీతం అందిస్తున్నాడు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గానీ, లేదా ఈ ఏడాది దసరా కానుకగా కానీ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడం తో ఈ మూవీ పై ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో మామూలు అంచనాలు లేవనే చెప్పాలి.సెట్స్ మీద ఉండగానే అన్నీ ప్రాంతాల నుండి కళ్ళు చెదిరే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి.