
Mega Family: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొదటి నుండి ఒక సామజికవర్గానికి చెందిన వాళ్ళ చేతుల్లోనే చిక్కుకొని ఉంది.నిర్మాతల దగ్గర నుండి హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఆ సామజిక వర్గానికి చెందిన వారే.అలాంటి పార్టీస్థితిలో వేరే సామజిక వర్గం నుండి ఇండస్ట్రీ కి వచ్చి నాలుగు దశాబ్దాలుగా నెంబర్ 1 హీరో గా కొనసాగుతూనే తన కుటుంబం నుండి ఎంతోమంది సూపర్ స్టార్స్ ని ఇండస్ట్రీ కి అందించిన మెగాస్టార్ చిరంజీవి అన్నా, ఆయన కుటుంబ సభ్యులన్నా కొంతమందికి పీకలదాకా కోపం ఉంటుంది.
చిరంజీవి అందరితో ఎంతో సన్నిహితంగా ఉంటారు,ఎంతో మర్యాదగా కూడా మాట్లాడుతాడు.అలాంటి వ్యక్తి మీద కామెంట్స్ చెయ్యడానికి మనసు ఎలా వస్తుందో అని అభిమానులు ఫీలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.కానీ అలా మెగా ఫ్యామిలీ మీద నోరు పారేసుకున్న వాళ్లందరీ కెరీర్స్ సహజంగానే సర్వనాశనం అయిపోయాయి.వాళ్లెవరో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
చిరంజీవి మీద అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్మడానికి ముందు ఉండే కుటుంబాలలో ఒకటి మంచు కుటుంబం, మోహన్ బాబు అనేక సందర్భాలలో చిరంజీవి మీద సంచలన ఆరోపణలు చేసిన ఘటనలు ఉన్నాయి.ముఖ్యంగా మా ఎన్నికలలో ఈ కుటుంబం చిరంజీవి ఫ్యామిలీ మీద చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.దీనితో మోహన్ బాబు మీద అతని కుటుంబం మీద జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.ఫలితంగా ఆయనకీ టాలీవుడ్ లో ఉన్న మార్కెట్ మొత్తం కోల్పోయి ఈరోజు సున్నా షేర్స్ ని రప్పించుకుని పరిస్థితి ఏర్పడింది.

ఇక చిరంజీవి మీద సంచలన ఆరోపణలు చేసి కెరీర్ ని సర్వనాశనం చేసుకున్న వారిలో ఒకరు హీరో రాజశేఖర్.ఈయన ఏకంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీదనే ఆరోపణలు చేసాడు.అబ్దుల్ కలాం లాంటి లెజెండ్స్ కూడా ప్రశంసించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై ఇలాంటి అసత్య ఆరోపణలు చెయ్యడం అప్పట్లో కలకలం రేపింది.సరిగ్గా ఆ సమయం లోనే రాజశేఖర్ మార్కెట్ డౌన్ అయ్యింది, మళ్ళీ ఇప్పటికి లెయ్యలేదు.
ఇక టీవీల ముందుకొచ్చి ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని చిరంజీవి పై ఆయన కుటుంబం పై అడ్డమైన బూతులు మాట్లాడిన శ్రీ రెడ్డి మరియు పోసాని కృష్ణ మురళి వంటి వారిని జనాలు అసలు మనుషులుగా చూడడమే మానేశారు.కేవలం మెగా ఫ్యామిలీ ని అంటేనే ఇలా అవుతుందని చెప్పడం కాదు మా ఉద్దేశ్యం,అసత్య ఆరోపణలు చేస్తే ఎప్పటికైనా రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని చెప్పడానికే మా ప్రయత్నం.