Allu Arjun’s wife’s beauty Secret: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌లా గ్లామర్ మెయింటైన్ చేస్తున్న వారిలో అల్లు స్నేహారెడ్డి ఒకరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా స్నేహారెడ్డి అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో స్నేహారెడ్డికి 9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అంటే.. ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే.. మరోవైపు తనకు నచ్చిన పనులు చేస్తూ లైఫ్‌ని ఆస్వాదిస్తున్నారు స్నేహారెడ్డి. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్‌గా ఉండే స్నేహారెడ్డి.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్‌తోపాటు బన్నీ, పిల్లలకు సంబంధించి అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుంటారు.
గ్లామర్ సీక్రెట్ వీడియో..
తాజాగా స్నేహారెడ్డి తన గ్లామర్ సీక్రెట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎప్పుడూ స్లిమ్ అండ్ ఫిట్‌గా కనిపించే స్నేహారెడ్డి.. ఇప్పుడు తన గ్లామర్ రహస్యం బయట పెట్టేసరికి ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆమె షేర్ చేసిన వీడియోలో.. వ్యాయామం, యోగా, హెల్తీఫుడ్‌తో పాటు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం.. నేచర్‌ని ఆస్వాదించడం.. లాంటివన్నీ తన రోజువారీ యాక్టివిటీస్‌లో భాగమేనని తెలిపారు. అన్నింటికి మించి స్నేహారెడ్డికి మొక్కలంటే చాలా ఇష్టమట. చుట్టూ మొక్కలు, చెట్లు ఉంటే.. ఎక్కువ సమయాన్ని వాటితో స్పెండ్ చేయడానికే ఇష్టపడతారట.
ఆనందంగా ఉంటే అందం, ఆరోగ్యం..
లైఫ్‌లో ఆనందంగా ఉంటే.. ఆరోగ్యం, అందం వాటంతటవే వస్తాయని చెప్పకనే చెప్పారు అల్లు స్నేహారెడ్డి. అందుకే తనకు ఆనందాన్ని కలిగించేవన్నీ ఇంట్లో పరిసరాలలో ఉండేలా చూసుకుంటానని తెలిపారు. ఇంట్లో కూడా నర్సరీ ఏర్పాటు చేసుకుని.. రోజూ మొక్కలకు వాటరింగ్ చేస్తూ.. వ్యాయామం, యోగాలతో డే స్టార్ట్ చేస్తారట స్నేహారెడ్డి.
మొత్తంగా పస్తుతం స్నేహారెడ్డి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అటు ఫ్యాన్స్‌ను ఇటు కామన్ పీపుల్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The real secret behind allu arjuns wifes beauty is leaked the video is viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com