
Australia Cricket Team Big Shock: భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు టెస్టు సిరీస్ కోల్పోయింది. అయితే మూడో టెస్టు విజయం, నాలుగో టెస్టు డ్రా ఆ జట్టుకు కాస్త ఊరటనిచ్చాయి. టెస్టు సిరీస్ ముగియడంతో వన్డే సిరీస్‌కు టీం ఇండియా, ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా దూరమవుతాడన్న వార్తలు వస్తున్నాయి.
తల్లి మరణంతో..
భారత పర్యటనకు వచ్చిన ప్యాట్ కమిన్స్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి ఆరోగ్యం విషయమించడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. రెండు టెస్టుల తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లడంతో మిగతా రెండు టెస్టులు ఆడలేదు. అయితే తల్లి మరణించడంతో కమిన్స్ అక్కడే ఉండిపోయాడు. వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిసింది. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్‌తోపాటు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.
వార్నర్ కూడా..
ఇక స్టార్ ఓపెనర్ వార్నర్ విషయానికి వస్తే.. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో అతడి మోచేయికి గాయమైంది. దీంతో అతడు వెంటనే స్వదేశానికి వెళ్లిపోయాడు. గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే అతడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో అతడు కూడా టీమిండియాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే గాయం కారణంగా ఆసీస్ స్టార్ పేసర్ జో రిచర్డ్‌సన్ కూడా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. మార్చి 17న ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
వన్డే సారిథిగా స్టీవ్ స్మిత్
భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్మిత్ బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. ప్యాట్ కమిన్స్‌ను వన్డేలకు ఎంపిక చేయలేదని, తన తల్లి మరణం తర్వాత కోలుకోవడానికి కమిన్స్‌కు కొంత సమయం ఇచ్చామని వెల్లడించింది. ప్రస్తుతానికి వన్డేలకు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను ప్రకటించామని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ పేర్కొన్నారు.
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
టెస్టు సిరీస్ మధ్యలో గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిన డేవిడ్ వార్నర్, దేశవాళీ టోర్ని ఆడేందుకు వెళ్లిన ఆస్టన్ అగర్ తిరిగి వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నారు.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కెమరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, నాథన్ ఇల్లిస్, ఆడమ్ జంపా.