spot_img
Homeట్రెండింగ్ న్యూస్Currency fallen On Roads:  మాదాపూర్ లోని మెయిన్ రోడ్డులో 2000 రూపాయల నోట్ల కట్టలు...

Currency fallen On Roads:  మాదాపూర్ లోని మెయిన్ రోడ్డులో 2000 రూపాయల నోట్ల కట్టలు తీరా చూస్తే ట్విస్ట్ అదుర్స్

Currency fallen On Roads: హైదరాబాద్ మహానగరంలో అది ఎప్పుడూ బిజీగా ఉండే మాదాపూర్ రోడ్డు.. ఆ రోడ్డుపై సీరియస్ గా వాహనాల్లో వెళుతున్న జనం ఒక్కసారికి అవాక్కయ్యారు. రూ.2వేల రూపాయల నోట్ల కట్టలు కట్టలుగా రోడ్డుపై దర్శనమిచ్చాయి. జనం వాటిని చూసి షాక్ తిన్నారు. ఆ నోట్ల కట్టలు చేజిక్కించుకునేందుకు పరుగులు తీశారు.

ఫ్రీగా డబ్బులు రోడ్డుపై పడాయనగానే జనం ఎగబడ్డారు. కష్టపడితే అవి కాపాడుకోవచ్చు. కానీ ఇలా ఫ్రీ గా వచ్చాయి కాబట్టి ఎవ్వరూ వదిలిపెట్టకుండా వారి వెంటపడ్డారు.రోడ్లపై రూ.2వేల నోట్లు కనిపిస్తే ఊరుకుంటారా? అసలే ఈ నోట్లకు గిరాకీ ఎక్కువ. అసలు ఎక్కువగా కనిపించడం లేదు కూడా. అందుకే రోడ్డుపై కనిపించగానే జనం ఎగబడ్డారు.

హైదరాబాద్ మాదాపూర్ సమీపంలోని కాకతీయ రోడ్డుపై బుధవారం కట్టలు కట్టలుగా రూ.2వేల నోట్లు ఉండడంతో స్థానికులు,వాహనదారులు ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. ఎవరికి దొరికిన డబ్బులు వారు తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ డబ్బులు ఏరుకున్న వారంతా కొద్దిసేపటికే షాక్ అయ్యారు.

మాధాపూర్ పరిధిలోని 100 ఫీట్ రోడ్ సమీపంలో కాకతీయ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు రూ.2వేల కరెన్సీ నోట్లు గుట్టలుగా పోసి ఉంచారు. అదే దారిలో వెళ్లే వాహనదారులు వాటిని చూసి వాటి కోసం పరుగులు పెట్టారు. దీంతో ఆ రహదారి బ్లాక్ అయ్యింది. ట్రాఫిక్ జాం ఏర్పడింది. నోట్లను తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. చాలా మంది వాటిని తీసుకొని ఇంటికెళ్లిపోయారు. ఈవిషయంలో పోలీసులకు చేరడంతో వారు రంగప్రవేశం చేశారు.

ఇక ఆ రూ.2వేల నోట్లను తీసుకున్న వారు ఆ నోట్లను తదేకంగా చూడగా అవాక్కయ్యారు. రూ.2వేల నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండడంతో తీసుకున్న వారు షాక్ అయ్యారు.

నకిలీ కరెన్సీ నోట్లని తెలియక నోట్లను తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. దీంతో కొంత సేపు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నకిలీ రూ.2వేల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
US Iran War

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...
US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Oktelugu Epaper