spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nagarjuna: జగన్‌ కు చిరంజీవి అంటే ఇష్టం.. నేనే వెళ్ళమన్నాను -...

Nagarjuna: జగన్‌ కు చిరంజీవి అంటే ఇష్టం.. నేనే వెళ్ళమన్నాను – నాగార్జున

Nagarjuna: ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై జగన్ తో మెగాస్టార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ పై హీరో అక్కినేని నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ.. ‘మా అందరి కోసమే చిరంజీవి గారు జగన్‌ గారితో సమావేశం అయ్యారు. ఆయన నాతో జగన్ దగ్గరకి వెళ్తున్నా అని చెప్పారు. అయితే, నా సినిమా విడుదల ఉండటం వల్ల నేను వెళ్లలేకపోయాను. నిజానికి జగన్‌ తో సమావేశం ఉంటుందని వారం క్రితమే చిరంజీవి చెప్పారు.

Nagarjuna
Nagarjuna

చిరంజీవి తన ఒక్కరి కోసం వెళ్లటం లేదు. అందరి కోసం వెళ్లారు. సీఎం జగన్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్‌ కు చిరంజీవి అంటే ఇష్టం. అందుకే , చిరంజీవి వెళ్తా అనగానే నేను వెళ్లమని సలహా ఇచ్చాను. ఇద్దరి భేటీతో ఇండస్ట్రీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నా. అయితే, నేను టికెట్ రేట్లపై స్పందించింది కేవలం నా సినిమా వరకు మాత్రమే’ అని మీకు మళ్ళీ చెబుతున్నా అంటూ నాగార్జున తెలిపాడు.

Also Read:  ఏళ్లుగా మంచానికే పరిమితమైన వ్య‌క్తి.. టీకా వేయగానే ఒంట్లో కదలికలు, మాటలు..!

ఇక గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్తూ చిరు మీడియాతో మాట్లాడుతూ.. ‘మరో గంటన్నరలో టికెట్ రేట్లతో పాటు అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని.. సీఎం ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా వచ్చినట్లు చిరు చెప్పారు. అయితే, తాజా సమాచారం ప్రకారం. చిరు – జగన్ కలిసి లంచ్ చేస్తున్నారు. లంచ్ తర్వాత 15 నిమిషాల పాటు ఇద్దరు చర్చించనున్నారు.

మరి వీరి మధ్య చర్చ పూర్తి అయిన తర్వాత వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటన చేస్తాడో ? చూడాలి. టికెట్ల రేట్ల విషయంలో సినిమా జనానికి మేలు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఒకవేళ సినిమా పరిశ్రమకు మేలు జరిగేలా జగన్ నిర్ణయం తీసుకుంటే గనుక అది మెగాస్టార్ గొప్పతనమే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి – జగన్ భేటీ ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచుస్తునారు.

Also Read: ఆ డెరెక్టర్ వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టిన ప్రముఖ హీరోయిన్..!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper