Pragya Jaiswal: ఏదో సామెత చెప్పినట్టు దురదృష్టం ప్రగ్యా జైస్వాల్ ని దెయ్యమై వెంటాడుతుంది. సూపర్ హిట్ పడినా కనీసం పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. అఖండ హిట్ తన ఫేట్ మార్చేస్తుంది అనుకున్న ప్రగ్యాకు నిరాశే మిగిలింది. 2021లో భారీ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది అఖండ. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 120 కోట్ల వసూళ్లకు వరకూ రాబట్టింది. బాలయ్యను వంద కోట్ల క్లబ్ లో చేర్చింది. డ్యూయల్ రోల్ లో బాలయ్య థియేటర్స్ దద్దరిల్లేలా చేశాడు.

అఖండ మూవీలో లీడింగ్ లేడీ రోల్ చేసే ఛాన్స్ ప్రగ్యాకు దక్కింది. ఏమాత్రం ఫార్మ్ లో లేని ప్రగ్యాకు బాలయ్యతో ఆఫర్ రావడం గొప్ప విషయం. అఖండ ముందు వరకు బాలయ్య కెరీర్ కూడా ఏమంత రంజుగా లేదు. వరుస ప్లాప్స్ తో డీలా పడ్డారు. అఖండ కూడా పోతే బాలయ్య ఇమేజ్ మరింత డామేజ్ అయ్యేది. బాలయ్యకు సరైన సమయంలో అఖండ రూపంలో హిట్ పడింది. బ్లాక్ బస్టర్ మూవీలో హీరోయిన్ గా చేసినప్పటికీ ప్రగ్యాకు ఏమాత్రం ప్రయోజనం దక్కలేదు.
అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య-బోయపాటి లాగేసుకున్నారు. దీంతో ప్రగ్యాకు కొత్తగా ఎలాంటి ఇమేజ్ రాలేదు. జనాలు మర్చిపోయిన మోహన్ బాబు ఆమెకు సన్ ఆఫ్ ఇండియా మూవీలో ఆఫర్ ఇచ్చాడు. అఖండ అనంతరం ప్రగ్యా చేసిన చిత్రం అదొక్కటే. ఇక సన్ ఆఫ్ ఇండియా సంచలనాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. పోస్టర్స్ ఖర్చు కాదు కదా… కనీసం మైదా రేటు కూడా రాలేదు. ఒకప్పటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు సన్ ఆఫ్ ఇండియా ఫలితం తీరని అవమానం.

పరిణామాలు చూస్తుంటే ప్రగ్యా కెరీర్ పుంజుకునే దాఖలాలు లేవు. ఆమె పూర్తిగా ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఒక ఓటీటీలో చిన్న సినిమాలు, సిరీస్లు చేసుకోవడమే నెక్స్ట్ ఆప్షన్. అయితే ప్రయత్న లోపం ఉండకూడదని తన వంతు కృషి చేస్తుంది. అందాలతో దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రగ్యా గ్లామర్ షో హద్దులు దాటేస్తుంది. అంతకంతకూ ఆమె డ్రెస్ చిన్నదైపోతుంది. మరి ప్రగ్యా పరువాల ప్రదర్శన ఏ మేరకు ఆమెకు ప్రయోజనం చేకూర్చుతుందో చూడాలి.