Homeట్రెండింగ్ న్యూస్Pawankalyan Fans : పవన్ అంటే ఇంత అభిమానమా? మరీ పెళ్లి కార్డుతో ప్రచారమా?

Pawankalyan Fans : పవన్ అంటే ఇంత అభిమానమా? మరీ పెళ్లి కార్డుతో ప్రచారమా?

Pawankalyan Fans  : పవన్ ను ఉన్నత స్థానంలో చూడాలని జన సైనికులు ఉవ్విళ్లూరుతున్నారు. పవన్ కు ఒక చాన్సిచ్చి చూద్దామని మిగతా సన్నిహితులకు వారు ఒప్పిస్తుంటారు. పవన్ గొప్పతనాన్ని కూడా చాటిచెబుతుంటారు. అటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని కూడా తమకు తెలిసిన గణాంకాలు చెబుతుంటారు. అయితే వారి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. తమ నాయకుడిపై గౌరవం కనిపిస్తోంది. పవన్ రావాలి పాలన మారాలి అన్నది వారి స్లోగన్. తాము ఏ పని చేసినా పవన్ని జనసేనను కలుపుకుని మరీ ప్రచారం చేస్తూ తన నిలువెల్లా పార్టీ మీద అభిమానాన్ని నింపుకున్న వారు చాలా మంది ఉన్నారు.

అయితే పవన్ పై అభిమానం ఇంతలా ఉంటుందా? అని ఆశ్చర్యపోయేలా విశాఖలో ఓ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు తన పెళ్లి కార్డుపై జనసేన మేనిఫెస్టో వేయడం విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం క్రిష్ణాపురం గ్రామంలో జనసేన అభిమాని తన పెళ్ళి కార్డు మీద మీద జనసేన ఎన్నికల ప్రణాళిక వేసి ప్రచారం చేస్తున్నారు అంటేనే వారి అభిమానం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తన పెళ్లి కార్డుకు వెనక వైపు జనసేన మ్యానిఫేస్టోతో పాటు పవన్ ఫోటో గాజు గ్లాస్ గుర్తు ముద్రించి కార్డులు పంచుతున్నాడు. వీటిని చూస్తున్న వారు జనసేన మేనిఫెస్టోను చదువుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేనను ఓటు వేయాలని తమకు నచ్చిన మార్గంలో జనసైనికులు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ యువకుడు కూడా అదే బలమైన ఆకాంక్షతో ఈ చర్యకు దిగాడు. ఈ కార్డులను జనసేన విశాఖ జిల్లా నాయకులకు పంచి పెట్టారు ఈ నెల 10న జనసేన అభిమాని పెళ్ళి. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులను కదిలిస్తోంది. ఇప్పుడీ ఎన్నికల ప్రచారాని ఇదో వినూత్న ఆదర్శంగా నిలిచింది. పవన్ సీఎం కావాలన్న కోరిక సైనికులలో ఎంత బలంగా ఉందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లుగా మీడియా వార్తల ద్వారా ప్రచారం సాగుతోంది. అయినా జనసేనను అభిమానించేవారు మాత్రం పవన్ ముఖ్యమంత్రి అవాల్సిందే అంటున్నారు. పవన్ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటిస్తే వీరంతా గంపగుత్తగా ఓటేయడం ఖాయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper