Homeజాతీయ వార్తలుKTR Tweet On NDTV: ఇక ఆ ఛానెల్‌ చూడను, అన్‌ఫాలో చేసేస్తున్నా : కేటీఆర్‌...

KTR Tweet On NDTV: ఇక ఆ ఛానెల్‌ చూడను, అన్‌ఫాలో చేసేస్తున్నా : కేటీఆర్‌ సంచలన నిర్ణయం!

KTR Tweet On NDTV: జాతీయ ఛానెల్‌ ఎన్డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్‌) ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ ఆదానీ వశం అయింది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఇకపై ఆ ఛానెల్‌ చూడబోనని స్పష్టం చేశారు. ఎన్డీటీవీని అన్‌ ఫాలో చేస్తున్నానని ట్వీట్‌ చేశారు. ఇందుకు ఎన్డీటీవీ డైరెక్టర్‌గా ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్, ఆయన భార్య రాధికారాయ్‌ దిగిపోయారని ఏఎన్‌ఐ వార్త సంస్థ రాసిన కథనాన్ని ట్యాగ్‌ చేశారు. ఇప్పటిదాకా ఎన్డీటీవీలో మంచి వార్తలు ప్రసారం చేశారని కేటీ ఆర్‌ కొనియాడారు.

KTR Tweet On NDTV
KTR

అదానీ గ్రూప్‌ అధికారిక టేకోవర్‌..
విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్‌ ఆగస్టులోనే ప్రకటించింది. ఎన్డీటీవీ ప్రమోటర్‌ సంస్థ ఆర్‌ఆర్‌ఆర్‌ హోల్డింగ్‌ సోమవారం తన ఈక్విటీ క్యాపిటల్‌లో 99.5 శాతాన్ని అదానీ గ్రూప్‌ యాజమాన్యంలోని విశ్వప్రదాన్‌ కమర్షియల్స్‌కి బదిలీ చేసింది, తద్వారా ఎన్డీటీవీ అధికారిక కొనుగోలును అదానీ గ్రూప్‌ పూర్తి చేసింది.

అదానీ ప్లాన్‌ ఏంటి?
ఓడరేవు, విమానాశ్రయం, మౌలిక సదుపాయాలు, ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్‌ అదానీ నుంచి అనేక రంగాలలో వ్యాపారం చేయడం గతంలో పెద్ద, ప్రసిద్ధ కొనుగోలు చేయడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచారు. కొంతమంది మాత్రం ఇదంతా ఎన్డీటీవీ మేనేజ్‌మెంట్‌ ఇష్టానికి వ్యతిరేకంగా స్వాధీనం చేసుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే, గౌతమ్‌ అదానీ ఇటీవల ఫైనాన్షియల్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్డీటీవీ ఒప్పందం గురించి మాట్లాడుతూ, ‘‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌తో పోటీపడే ఛానెల్‌ మన దేశంలో లేదు. మీడియా హౌస్‌కు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు? దానిని స్వతంత్రంగా ఎందుకు చేయకూడదు. ఇండిపెండెంట్‌ అంటే ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అనాలి, కానీ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తున్నప్పుడు దానిని బహిరంగంగా చెప్పే ధైర్యం కూడా ఉండాలి’’ అని అన్నారు.

KTR Tweet On NDTV
NDTV

బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని..
అదానీ, అంబానీలకు కేంద్రం కొమ్ముకాస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లతోపాటు కనీస అర్హత లేని నాయకులలు కూడా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.. తమ పార్టీ అధినేత, ముఖ్యమైన మంత్రి తానా అంటే క్యాడర్‌ తందానా అనడం టీఆర్‌ఎస్‌లో సాధారణమే. ఈ క్రమంలో జాతీయస్థాయిలో మంచి రేటింగ్‌ ఉన్న ఎన్డీటీవీని అదాని టే కోవర్‌ చేయడం ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌ నేతలకు మింగుడు పడని అంశం. ఈ నేపథ్యంలో అధానీ ఆధ్వర్యంలో ఎన్డీటీపీ ఇకపై పారదర్శక వార్తలు రాయదని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో కేటీఆర్‌ అన్‌ఫాలో చేస్తున్నట్లు ట్వీట్‌ చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper