
Heart Attack Covishield: కోవిడ్ మహమ్మారి ప్రపంచంలో సృష్టించిన ఉత్పాతం అంతా ఇంతా కాదు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.. చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలో కోవిడ్ కు విరుగుడుగా వచ్చిన వ్యాక్సిన్లతో చాలామంది వైరస్ ను జయించారు. ఆ తర్వాత కొంతకాలానికి కోవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడు కొత్త తరహా ఫ్లూ వెలుగు చూడటం, గుండెపోటు తరహా మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మరొకసారి వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ డాక్టర్ తెలిపిన వివరాలు ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కోవిడ్ తీవ్రంగా ప్రబలినప్పుడు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ను అస్ట్రా జెనేకా అనే కంపెనీ తయారు చేసింది. అప్పట్లో ఈ వ్యాక్సిన్ కోవిడ్ ను నయం చేస్తుంది అని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే కోవిడ్ వైరస్ కు శాస్త్రీయంగా ఎటువంటి చికిత్స విధానం లేకపోవడంతో, ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ వేసుకోవడాన్ని ప్రోత్సహించింది. ప్రభుత్వమే రంగంలోకి దిగి దేశంలోని ప్రజలందరికీ ఒకటి నుంచి రెండు డోసులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ లు వేయడం ప్రారంభించింది. అయితే అప్పట్లో ఈ వ్యాక్సిన్ వేసుకునేందుకు చాలా మంది నిరాకరించారు. అయినప్పటికీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా వ్యాక్సిన్ వేసింది. దేశంలో సుమారు 97 శాతం మందికి ఈ వ్యాక్సిన్ వేసినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి.

అయితే కోవిడ్ తగ్గు ముఖం పట్టిన తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్త ఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి.. దీనికి తోడు గుండెపోటు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వయసు బేధం లేకుండా ఇటీవల దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. దీనికి కారణం ఏంటని భారత సంతతికి చెందిన బ్రిటిష్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీం మల్హోత్ర షాకింగ్ విషయాలు బయటపెట్టారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల శరీరం అనేక రకాల మార్పులకు గురవుతోందని, అందువల్లే గుండెపోటు మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన వివరించారు. ఇటీవల కోవిషీల్డ్ వేసుకున్న కొంత మందిని ఆయన పరీక్షించారు. ఈ సందర్భంగా వారి శరీరంలో జరుగుతున్న మార్పులను ఆయన గమనించి.. ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం అసీమ్ మల్హోత్రా చెప్పిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా కోవీషిల్డ్ వ్యాక్సిన్ పై కూడా అనుమానాలు మొదలయ్యాయి. మరి దీనిపై ఆస్ట్రా జెనేకా కంపెనీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.