Cordyceps Fungus: గల్వాన్ లోయ ఘటన తర్వాత చైనా మన భూభాగంలోకి ఎందుకు చొరబడింది? వాస్తవాధీన రేఖను దాటి ఎందుకు చొచ్చుకు వచ్చింది? సైనికుల ప్రాణాలను ఎందుకు ఫణంగా పెట్టింది. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక సమాధానం ఫంగస్.. ఏంటి ఫంగస్ కోసం చైనా ఈ స్థాయి దురాక్రమణకు పాల్పడిందా అని అనుకుంటున్నారా? ఇది విని ఆశ్చర్యపోతున్నారా? మీరు నమ్మినా, నమ్మకున్నా చైనా దురాక్రమణకు పాల్పడింది నిజం. ఒక ఫంగస్ కోసం ఆ దేశ సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు కూడా వెనుకాడ లేదనేది నిజం.

బంగారం కంటే విలువైనది
అరుణాచల్ ప్రదేశ్… మనదేశంలో ఈశాన్య ప్రాంతంలో ఉండే రాష్ట్రం ఇది. దట్టమైన అడవులకు, అరుదైన మొక్కలకు ఈ ప్రాంతం ఆలవాలం. అయితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కంటే అరుదైన మొక్కలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.. పైగా అరుణాచల్ ప్రదేశ్ లో “కార్టి స్టెప్స్” అని అరుదైన పుట్టగొడుగుల రకానికి చెందిన గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ ఫంగస్ ఉంటుంది.. ఇది అరుదైన రకానికి చెందింది.. దీంట్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి.. ఇవి పసుపు, కాషాయ రంగులో ఉన్న సన్నటి పోగులు లాగా ఉంటాయి. వీటిని “సూపర్ మాష్రూమ్స్” గా పిలుస్తారు. ఇవి అత్యంత ఖరీదైనవి. బంగారం కంటే వీటి ధర ఎక్కువ. వీటి 10 గ్రాముల ధర సుమారు 700 డాలర్లు మన కరెన్సీ లో అయితే 56, 000 దాకా ఉంటుంది. ఇక మేలైన వాటి ధర కిలో లక్ష లోపే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ఇలా వెలుగులోకి వచ్చింది
ఇటీవల భారత భూభాగంలోకి చైనా సైనికులు పదేపదే చొరబడుతున్న నేపథ్యంలో పసిఫిక్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ ఒక సర్వే నిర్వహించింది. ఆ సంస్థ వెలువరించిన నివేదికలో విస్తు పోయే వాస్తవాలు కళ్లకు కట్టాయి.. ఇక భారత దేశంలోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనా నైరుతిలోని కింగై- టిబెట్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో కార్డి స్టెప్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 2022 నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా వీటి మార్కెట్ విలువ మిలియన్ డాలర్ గా ఉన్నట్టు ఒక అంచనా.. ఇక వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ముందుభాగం లో ఉంది. అయితే, అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కింగై ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా వీటి సాగు క్షీణించింది. అయితే ఇటీవల కాలంలో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. . తాజాగా వీటిని అన్వేషించుకుంటూనే అరుణాచల్ ప్రదేశ్ లోకి చైనా సైనికులు చొరబడినట్టు “ఐపీసీఎస్సీ” సంస్థ తెలిపింది.

వీటివల్ల ఏం ఉపయోగం
ఈ ఫంగస్ వివిధ రకాల వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. పైగా వీటిని వాడిన తర్వాత ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. గతంలో ఈ ఫంగస్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా చైనా మిలియన్ కొద్దీ డాలర్లను ఆర్జించింది. అయితే గత కొంతకాలంగా వీటి ఉత్పత్తి దారుణంగా పడిపోవడంతో వీటి అన్వేషణలో భాగంగా చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది.. కానీ చాలామంది సరిహద్దు ఆక్రమణకు అనుకున్నారు కానీ తీరా తెరిచి చూస్తే అసలు విషయం ఇది అని తేలింది.. అటు జపాన్ నుంచి మొదలుపెడితే టిబెట్ వరకు ఆక్రమించుకుంటూ వస్తున్న చైనా… చివరకు ఫంగస్ ను కూడా వదలడం లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.. దేశంలో కోవిడ్ విజృంభిస్తుంటే ఫంగస్ కోసం పాకులాడటం దేనికని చురకలు అంటిస్తున్నారు.