Union Health Minister Report: ఎయిడ్స్ వ్యాధి రాక ముందు పడుపు వృత్తి చేసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. హెచ్ ఐవీ రావడంతో చాలా మంది ఆ వృత్తిని వదిలేసి ఇతర మార్గాలు వెతుక్కున్నారు. ప్రస్తుతం ఎయిడ్స్ నియంత్రణలోకి రావడంతో ఇప్పుడు కూడా చాలా మంది ఆ వృత్తినే ఎంచుకుంటున్నారు. ఫలితంగా డబ్బు సంపాదిస్తున్నారు. పడుపు వృత్తి చేసుకునే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగానే ఉంది. ఇతర వృత్తుల్లో ఇమడలేక బతుకుదెరువు కోసం దాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వమే తెలియజేస్తోంది. దేశంలో అత్యధిక మంది పడుపు వృత్తి చేపట్టే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడం గమనార్హం.

పడుపు వృత్తి చేసుకునే కార్మికులు ఎక్కువగా ఇక్కడే ఉంటున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నట్లు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి సెక్స్ వ్యాపారాలు చేసే వారి సంఖ్య దేశంలోనే ఏపీనే మొదటి స్థానంలో నిలిచింది. గతంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు ఆ స్థానాన్ని ఏపీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వారి జీవితాలు దుర్భరంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. హెచ్ఐవీ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నివేదికను తయారు చేసింది.
పడుపు వృత్తి చేసుకునే వారి సంఖ్య దేశంలోనే ఎక్కువగా ఉన్నా వారి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవు. ఆర్థిక ఇబ్బందుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ర్టంలో అత్యధికంగా 133 లక్షల మంది ఈ వృత్తినే జీవనాధారంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ వారికి చుట్టు ముట్టు సమస్యలే ఉన్నాయి. వారి జీవితాలను బాగు చేసే శ్రద్ధ ప్రభుత్వానికి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వారి ఆలనాపాలన చూడాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలో 1.16 లక్షలు, తెలంగాణలో లక్ష మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. పడుపువృత్తి కార్మికులు ఏపీలో అత్యంత దారుణంగా బతుకుతున్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పడుపు వృత్తి చేసుకునే వారి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఏపీలో ఏ మూలకు వెళ్లినా పడుపు వృత్తి వారు కనిపిస్తుంటారు. కానీ వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు మాత్రం అందడం లేదు. ఇంకా లెక్కల్లో లేని వారు కూడా ఉంటారనే అనుమానాలు అందరు వ్యక్తం చేస్తున్నారు.
పడుపు వృత్తి చేసుకునే వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ జగన్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వారి బతుకులు ఆదరణ కోల్పోతున్నాయి. ఎందరికో సుఖాన్నిచ్చే వారికి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం పడుపు వృత్తి చేసుకునే వారి కోసం పలు పథకాలు చేపట్టి వారి బతుకులు మార్చేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.