White Hair Treatment: మనలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది. వెంట్రుకలు కూడా ఊడిపోతున్నాయి. దీంతో వయసు పెద్దవారిలా కనబడుతున్నారు. నలుగురిలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇరవైలోనే అరవైలా మారిపోతున్నారు. దీనికి ప్రధానకారణం మన ఆహార అలవాట్లే. ప్రొటీన్లు లేని పదార్థాలు తినడం వల్ల చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. దీంతో ముసలి వారి ఫీలింగ్ కలుగుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మన జుట్టు తెల్లబడకుండా ఉంటేందుకు నానా పాట్లు పడుతున్నారు. దొరికిన వాటిని వాడుతూ నిరాశ పడుతున్నారు. తమ జుట్టు నల్లబడటానికి దారులు లేవా అని ఎదురుచూస్తున్నారు.

ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో వాటిని వాడటం వల్ల మనకు ఇబ్బందులు రాకుండా సమస్య పరిష్కరించే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే పద్ధతి పాటిస్తే మనకు తెల్లవెంట్రుకలు దరిచేరకుండా ఉంటాయి. దీనికి మనం చేయవల్సిందల్లా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఎండిన ఉసిరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల కలోంజి విత్తనాలు వేసుకుని నాలుగు నిమిషాల పాటు వేడి చేసుకుని తీసుకోవాలి. అవి చల్లారిన తరువాత పొడి చేసుకుని పెట్టుకోవాలి.
దీన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరినూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఉసిరి కలోంజి పొడిని వేసి పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి తరువాత దాన్ని వడబోసి వచ్చిన ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని భద్రపరచుకోవాలి. దీన్ని రోజు రాత్రి నిద్రపోయే ముందు వెంట్రుకలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. జుట్టుకు రాసుకుని మసాజ్ చేసుకుని మరుసటి రోజు షాంపుతో స్నానం చేస్తే ఫలితం వస్తుంది.

వారంలో రెండు సార్లయినా ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. ఈ ఆయిల్ వాడి తెల్ల జుట్టు రాకుండా నిరోధించుకోవాలి. కురులు నల్లగా నిగనిగలాడితే బాగుంటుంది. ఈ ఆయిల్ తో జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇన్ని లాభాలున్న దీన్ని వాడుకుని మన వెంట్రుకలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇటీవల కాలంలో ఆరోగ్యానికన్నా జుట్టుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే దీన్ని వాడుకుంటే మనకు తెల్లజుట్టు సమస్య రాకుండా పోతుందని తెలుసుకుని వాడుకుంటే మంచిది.