Cow Gives Birth Lion: కలియుగంలో వింతలు జరుగుతాయని ఆనాడే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. ఇందులో భాగంగానే పలు వింతలు జరుగుతున్నాయి. ఆయన ఆనాడే సూచించారు. నంది కడుపున పంది పుడుతుందని సెలవిచ్చారు. కాకపోతే ఇప్పుడు ఆవు కడుపున సింహం జన్మించడం ఆందోళనకు తావిచ్చింది. ఆయన చెప్పిన వింతలు పలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆవు కడుపులో సింహం జన్మించడంతో అందరు అవాక్కయ్యారు. దాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు.
మధ్యప్రదేశ్ లోని రైసెన్ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సత్తులాల్ అనే రైతుకు చెందిన ఆవు కడుపులో సింహం జన్మించింది. దీంతో విషయం గ్రామంలో వ్యాపించడంతో అందరు వచ్చి చూశారు. ఆవు గర్భాశయంలో జన్యు లోపం వల్లే ఇలా సింహం జన్మించిందని పశు వైద్యాధికారి తెలిపారు. జన్యులోపం కారణంగానే ఇలాంటి దూడ పుట్టినట్లు చెబుతున్నారు.
పుట్టిన తరువాత ఆరోగ్యంగానే ఉన్నా ముప్పై నిమిషాల్లోనే చనిపోయింది. దీంతో సింహాన్ని పోలిన దూడను చూసేందుకు జనం ఎగబడ్డారు. విషయం కాస్త అందరికి తెలియడంతో ప్రజలంతా క్యూ కట్టారు. దూడను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. కలియుగ వింతల్లో ఇదొకటని పేర్కొంటున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు వింతలు చోటుచేసుకోవడం గమనార్హం.
కలియుగంలో ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ వింత దూడ జననం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జన్యు లోపం అని వైద్యులు చెబుతున్నా కలికాలంలో జరిగే వింతలు విశేషాల్లో భాగంగానే ఇలా జరిగినట్లు భావిస్తున్నారు. మొత్తానికి వింత దూడను చూసేందకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. కలియుగం అంతానికి వచ్చిందనే వాదనలు కూడా వస్తున్నాయి.