Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni And Roshan: అక్కినేని అఖిల్ కంటే శ్రీకాంత్ కొడుకు బెటరా..?

Akhil Akkineni And Roshan: అక్కినేని అఖిల్ కంటే శ్రీకాంత్ కొడుకు బెటరా..?

Akhil Akkineni And Roshan: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. యంగ్ హీరోలు స్టార్ హీరోలతో సైతం పోటీపడే రేంజ్ కి వెళ్ళిపోతున్నారు. కొత్త కథతో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళకంటూ ఒక అరుదైన గౌరవాన్ని కూడా పొందుతున్నారు. నాగార్జున కొడుకైన అఖిల్ కి సరైన సక్సెస్ లైతే రావడం లేదు. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఒక్క […]

Akhil Akkineni And Roshan: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. యంగ్ హీరోలు స్టార్ హీరోలతో సైతం పోటీపడే రేంజ్ కి వెళ్ళిపోతున్నారు. కొత్త కథతో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళకంటూ ఒక అరుదైన గౌరవాన్ని కూడా పొందుతున్నారు. నాగార్జున కొడుకైన అఖిల్ కి సరైన సక్సెస్ లైతే రావడం లేదు. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం హీరో శ్రీకాంత్ కొడుకు అయిన రోషన్ సైతం ఇండస్ట్రీలో తన సత్తా చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

‘ఛాంపియన్’ సినిమాతో ప్రేక్షకులందరిని మైమరపింపజేసిన ఆయన తొందర్లోనే స్టార్ డైరెక్టర్లతో సైతం సినిమాలు చేసే స్థాయికి ఎదుగుతున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్, రోషన్ ఇద్దరిని పోలుస్తూ అఖిల్ కంటే రోషన్ చాలా బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ అసలు ఏ మాత్రం తన సత్తా చాటుకోలేకపోతున్నాడు.

ప్రస్తుతం లెనిన్ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే పర్లేదు లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం ఉంది. అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించకపోవచ్చు… ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలు అంత ఎఫెక్ట్ గా ఉండడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. వీటన్నింటినీ ఓవర్కమ్ చేసి తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటే తప్ప అఖిల్ కి భారీ అవకాశాలైతే రావు… లెనిన్ సినిమా సక్సెస్ మీదనే ఆయన కెరీర్ ఆధారపడి ఉంది.

లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోయి అతని మార్కెట్ కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదమైతే ఉంది…చూడాలి మరి అఖిల్ రాబోయే సినిమాలతో సత్తా చాటి స్టార్ హీరో అవుతాడా? లేదంటే రోషన్ టాప్ హీరోగా మారతాడా అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper