‘రాజశేఖర్.. ’ సంఘ విద్రోహ శక్తుల పాలిట ఆయన ‘కల్కి’.. అవినీతి మదగజాల పాలిట ‘అంకుశం’! సోదరులకు జీవితాన్ని అర్పించే ‘మా అన్నయ్య’.. ప్రేమించే వారిని గుండెల్లో దాచుకునే ‘అల్లరి ప్రియుడు’! ఒకటా.. రెండా..? వెండి తెరపై ఆయన పోషించని పాత్ర లేదు. ఆయన నటనా వైదూష్యానికి కరతాళ ధ్వనులు చేసిన ప్రేక్షకులు.. యాంగ్రీ యంగ్ మెన్ గా తమ గుండెల్లో శాశ్వతంగా దాచుకున్నారు. అయితే.. ఆయన సినిమాల గురించి అందరికీ తెలిసినప్పటికీ.. రాజశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం కొందరికే తెలుసు. ఆ వివరాలేంటో మనమూ చూద్దామా?
వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ.. రాజశేఖర్ మాత్రం.. డాక్టర్ అయిన తర్వాతే యాక్టర్ అయ్యారు. 1962 ఫిబ్రవరి 4న తమిళనాడు లోని లక్ష్మీపురం లో జన్మించారు రాజశేఖర్. బాల్య విద్యాభ్యాసం అంతా అక్కడే ముగిసింది. ఆ తర్వాత ఉన్నత చదువులు చదివిన ఆయన.. ఆ రోజుల్లోనే ఎమ్.బి.బి.ఎస్ పట్టా పుచ్చుకున్నారు. అంతేకాదు.. చెన్నైలో ప్రాక్టీస్ కూడా పెట్టారు.
Also Read: రాజకీయాల్లోకి అనసూయ.. ఏ పార్టీలో చేరబోతోంది?
ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన రాజశేఖర్.. 1984లో ‘పుథుమై పెన్’ అనే తమిళ్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి భారతి దర్శకత్వం వహించారు. ఆ తరువాత 1985లో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చారు రాజశేఖర్. ఈ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే.. రాజశేఖర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘తలంబ్రాలు’. ఈ సినిమా అన్ని విభాగాల్లోనూ కొత్తగార ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. సూపర్ హిట్ గా నిలిచింది.
లేడీ ఓరియెంటెడ్ మూవీ గా వచ్చిన ఈ సినిమా లో రాజశేఖర్ సరసన జీవిత నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. మెజారిటీ సినిమాలు హిట్ కావడంతో వీరి జంట హిట్ పెయిర్ అని టాక్ తెచ్చుకుంది. ఆ విధంగా ప్రేమలో పడిన జీవితారాజశేఖర్.. నిజ జీవితంలో హిట్ పెయిర్ గా నిలిచారు. వీరికి ఇద్దరు కుమార్తలు శివాని, శివాత్మిక. వీరిలో శివాత్మిక ‘దొరసాని’ సినిమాలో నటించగా.. ఇపుడు శివాని కూడా ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం.
Also Read: రివ్యూ : ఉప్పెన : ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ స్టోరీ !
వరుస విజయాలతో టాప్ హీరో స్థాయికి ఎదిగిన రాజశేఖర్ డబ్బింగ్ గురించి అప్పట్లో చాలా మందికి తెలియదు. కంచు కంఠంతో భీకరమైన డైలాగులు చెప్పే ఆ వాయిస్ సాయికుమార్ ది అన్న సంగతి ఆ తర్వాత పబ్లిక్ అవుతూ వచ్చింది. తెరపై రాజశేఖర్ నటనా రాజసాన్ని ఒలికిస్తే.. తెర వెనుక సాయి కుమార్ తనదైన రీతిలో డైలాగులు పలికించేవాడు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
రాజశేఖర్ కెరీర్ లో ఎన్నో మరపురాని విజయాలు ఉన్నాయి. శృతి లయలు, ఆహుతి, అంకుశం, అన్న, అల్లరి ప్రియుడు, మా అన్నయ, సింహరాశి, గోరింటాకు నుంచి.. మొన్నటి పి.ఎస్. గరుడవేగ వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు ఈ యాంగ్రీ యంగ్ మాన్. ఒక దశలో టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ లకు గట్టి పోటీ ఇచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న రాజశేఖర్.. గరుడ వేగతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్కి కొత్త అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం భార్య జీవిత దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నారు రాజశేఖర్. ఈ విధంగా సినీ ప్రేక్షకులను అలరించేందుకు నిత్యం తనదైన ప్రయత్నం చేస్తున్న రాజశేఖర్ ను మనస్ఫూర్తిగా అభినందిద్దాం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: There are many facts you may not know about rajasekhars life
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com