Super Movie Heroine: అప్పట్లో తన అందంతో, అభినయంతో కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. కానీ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది. అక్కినేని నాగార్జున తన కెరియర్ లో నటించిన ఎన్నో సినిమాలలో సూపర్ సినిమా కూడా ఒకటి. సూపర్ సినిమా విజయం సాధించడంతో ఈ హీరోయిన్ కు మంచి గుర్తింపు వచ్చింది. గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమా హీరోయిన్ పేరు అయేషా టాకియా. ఏప్రిల్ 10న ఆమె పుట్టినరోజు కావడంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు విషెస్ తెలుపుతున్నారు. కానీ ఆమె ట్రోలింగ్ భరించలేక తన సోషల్ మీడియా ఖాతాలన్నీ క్లోజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. హిందీలో అయేషా టార్జాన్ ది వండర్ కార్, వాంటెడ్ వంటి సినిమాలలో నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. కొన్ని ఏళ్ల నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
2004లో అయేషా టార్జాన్ ది వండర్ కార్ సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తన అమాయకమైన నటనతో, అందంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సోచానాథ, దిల్ మాంగే మోర్, షాది సే పాహెల్, నో స్మోకింగ్, పాఠశాల, వాంటెడ్ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. అయేషా తనకు 23 సంవత్సరాల వయసులో ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకుంది. ఫర్హాన్ అజ్మీ సమాజ్వాది పార్టీ నాయకుడు అబు అజ్మీ కొడుకు. ఇతను హోటల్ వ్యాపారంలో బాగా రాణిస్తున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అయేషా ఇస్లాం మతంలోకి మారి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
అయితే కొన్ని ఏళ్ల క్రితం ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు వినిపించాయి. ఈ సర్జరీ తర్వాత ఆమె ముఖం పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. ఆమె లుక్స్ గురించి సామాజిక మాధ్యమాలలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అయేషా టాకియా తన సోషల్ మీడియా ఖాతాలన్నీ బ్లాక్ చేసేసింది. కానీ తర్వాత ఆమె ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా మారినట్లు తెలుస్తుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.