Villain Raghuram: ఇతను మరెవరో కాదు ఫేమస్ విలన్ రఘురాం. పేరు చెప్తే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ అతనిని చూస్తే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఈజీగా గుర్తుపడతారు. రఘురాం కు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ విలన్స్ లో రఘురాం కూడా ఒకరు. తెలుగులో ఈయన ఎన్నో సినిమాలలో నెగిటివ్ పాత్రలో కనిపించే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగుతోపాటు రఘురాం తమిళ్, హిందీ భాషలలో కూడా అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. దేశవ్యాప్తంగా ఇతనికి బాగా ఫాలోయింగ్ ఉంది. కానీ ఇతను అచ్చ తెలుగు అబ్బాయి అంటే ఎవరు నమ్మరు. రఘురాం ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నం లో తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆ తర్వాత తనకు నటనపై ఆసక్తి ఉండడంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ లో రఘురాం ఎక్కువగా ఎం టీవీ రౌడీ షో ద బాగా పాపులర్ అయ్యాడు. ఈ షో ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మరికొన్ని టీవీ షోలలో సందడి చేశాడు. శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. డాక్టర్ సినిమాలో విలన్ గ్యాంగ్ మెంబర్గా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాతో రఘురాంకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగుతోపాటు తమిళ్లో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. రఘురాం క్రీడాకోల, మెకానిక్ రాఖి వంటి సినిమాలతో తెలుగులో బాగా ఫేమస్ అయ్యాడు.
Also Read: సింపుల్ సూపర్ ఈ బ్యూటీ. అందానికే మరో పేరులా ఉందిగా
ఇప్పుడిప్పుడే ఇతనికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇతని వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే రఘురాం కెనడాకు చెందిన సింగర్ నటాలియన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం వీరిద్దరి పెళ్లి జరిగింది. తెలుగుతోపాటు క్రిస్టియన్ సాంప్రదాయంలో కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇదంపతులకు ఒక బాబు ఉన్నాడు. లేటెస్ట్ గా రఘురాం ఫ్యామిలీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు పెళ్లి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వీరిద్దరూ తమ ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే రఘురాం ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను మరియు పెళ్లి వీడియోలను చూసిన వాళ్ళందరూ విలన్ రఘురాం భార్య ఒక స్టార్ సింగరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. రఘురాం కు ఇంత అందమైన భార్య ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రఘురాం దంపతుల 5వ వార్షికోత్సవ వేడుక ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram