Kannappa Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మోహన్ బాబు (Mohan Babu) లాంటి నటుడు సైతం ఒకప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కొడుకులు మాత్రం ఆశించిన మేరకు హీరోలుగా రాణించలేకపోయారు. మోహన్ బాబు పెద్దకొడుకు అయిన మంచు విష్ణు తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే కన్నప్ప (Kannappa) అనే సినిమా చేస్తున్నాడు ఆ మూవీ కోసం 150 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) రుద్ర (Rudra) అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా హైలెట్ గా నిలువబోతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. నిజానికి ప్రభాస్ ఈ సినిమా మొత్తానికి ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ గా నిలువబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read : అక్షరాలా 800 కోట్లు..#SSRMB ని దాటేసిన అల్లు అర్జున్, అట్లీ చిత్రం!
కన్నప్ప సినిమాలో మ్యాటర్ ఉన్న లేకపోయిన కేవలం ప్రభాస్ ను చూసి ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి అని కొంతమంది మేధావులు అయితే చెబుతున్నారు. మరి విష్ణు హీరోగా చేసినప్పటికి ఆయనకి ఇందులో ఏమీ ఉండదని ప్రభాస్ ద్వారానే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాబోతున్నాయని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయినప్పటికి ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ డ్యూరెషన్ పది నిమిషాల పాటు ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ప్రస్తుతం మంచు విష్ణు మాత్రం ఈ మూవీ విషయం లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.
ఎందుకంటే ఆయన కనక ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ లెవెలో చేస్తే మాత్రం సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది లేకపోతే మాత్రం డిజాస్టర్ గా మిగులుతుంది. ఒకవేళ ఈ సినిమా తేడా కొడితే మాత్రం విష్ణుకి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమా భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది…
ALso Read : రేపే ఓటీటీలోకి రానున్న ‘చావా’..ఎందులో చూడాలంటే!