Vijaya Reddy case: చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి ఐటీ ఉద్యోగిని విజయ రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ సాగించారు.
విజయ రెడ్డికి ఆర్థికంగా ఎటువంటి కష్టాలు లేవు. ఆమె భర్త విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారు. విజయ రెడ్డికి నెలకు భారీగానే వేతనం వస్తోంది. తన భర్త వేతనం కూడా ఆమె ఖాతాలోనే పడుతోంది. ఇద్దరు పిల్లలు కార్పొరేట్ విద్యాలయాలలో చదువుతున్నారు. ఆర్థికంగా కష్టాలు లేవు. కుటుంబ పరంగా ఇబ్బందులు లేవు. బంధువులతో ఆస్తి తగదాలు అంతకంటే లేవు.
ఎటువంటి ఇబ్బందులు లేని విజయ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం ఒకరకంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసు కు సంబంధించి రకరకాల కోణాలలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విజయా రెడ్డి భర్తను విచారించారు. ఆ తర్వాత విజయా రెడ్డి ఫోన్ డాటాని కూడా విశ్లేషించారు. ఆమెకు వచ్చిన ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త కూడా ఎటువంటి వివాదాలు తమ మధ్య లేవని.. ఆర్థికంగా కష్టాలు కూడా లేవని చెప్పారు. దీంతో ఈ కేసు దర్యాప్తు పోలీసులకు ఒక సవాలుగా మారింది.
మీడియాలో విజయ రెడ్డి కేసు కు సంబంధించి రకరకాల కథనాలు ప్రచారం కావడంతో ఏం చేయాలో తెలంగాణ పోలీసులకు అర్థం కాలేదు. దీంతో మరోసారి విజయ రెడ్డి కుటుంబ సభ్యులను విచారించారు. ఆమె భర్తను కూడా అనేక రకాల ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడి.. తీవ్రమైన డిప్రెషన్ వల్ల విజయ రెడ్డి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు.
“ఈ కేసును అనేక కోణాలలో పరిశీలించాం. అనేకమంది వ్యక్తులను విచారించాం. కీలకమైన ఆధారాలు లభిస్తాయని లోతుగా దర్యాప్తు సాగించాం. అయినప్పటికీ మేము అనుమానించే విషయాలు ఏవీ విచారణలో తెలియలేదు. దీంతో తీవ్రమైన ఒత్తిడి, మానసిక వేదనతోనే విజయ రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. తను లేకపోతే పిల్లలు ఇద్దరు అనాధలు అవుతారని భావించి.. వారిద్దరిని కూడా తనతోపాటు ఆత్మహత్యకు పురిగొల్పింది. ఆమె మీద తెలియని ఒత్తిడి ఉంది. అందువల్లే తీవ్రమైన ఇబ్బందికి గురైంది. ఫలితంగా ఆత్మహత్య చేసుకుందని” పోలీసులు వెల్లడించారు.
