spot_img
HomeతెలంగాణMLA Mandula Samuel Wines Owners: కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడియో.. ఇంతకీ అందులో...

MLA Mandula Samuel Wines Owners: కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడియో.. ఇంతకీ అందులో ఏముందంటే?

MLA Mandula Samuel Wines Owners: నేటి కాలంలో ఏ విషయమైనా సరే వెంటనే బయటికి వస్తోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రతి విషయం క్షణంలోనే బయటికి తెలుస్తోంది.. అలాంటి విషయమే ఇది కూడా. కాకపోతే ఇప్పుడు అధికారానికి దూరంగా ఉన్న భారత రాష్ట్ర సమితి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా హ్యాండిల్ లో ఈ వీడియో కనిపిస్తోంది.. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఆయన చేసిన వ్యవహారం ఏంటి?

అధికారానికి దూరం కావడం.. పార్లమెంటు ఎన్నికల్లో సున్నాకు పరిమితం కావడంతో భారత రాష్ట్ర సమితి.. మళ్లీ తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో మరింత బలోపేతం అవ్వడానికి విపరీతంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ట్విట్టర్లో రకరకాల హ్యాండిల్స్ ను ఏర్పాటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిన్న లోపాన్ని సైతం భూతద్దంలో పెట్టి చూపిస్తోంది. అంతేకాదు 10 సంవత్సరాల కెసిఆర్ పరిపాలన కాలంలో తెలంగాణ ఇలా ఉండేదా అంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే బదులిస్తోంది. మొత్తంగా అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ మధ్య యుద్ధం జోరుగానే సాగుతోంది..

ఇక తాజాగా భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేసే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వీడియో పోస్ట్ అయింది.. ఆ వీడియోలో ఏం ప్రస్తావించారంటే..” కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వసూళ్ల దందా.. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మామూళ్ల వసూలు.. వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్న మందుల సామెల్. ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టాను. రికవరీ కావాల్సిందే. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో? లేదో? తెలియదు. రోజుకు లక్ష ఖర్చు వస్తుంది. డీజిల్ కు కూడా డబ్బులు లేవు. ప్రభుత్వం ఇచ్చే జీతం కొసరు అవుతలేదు. మీరు ఇచ్చే మామూలు నాకు టీ ఖర్చులకు కూడా సరిపోవు. నా మాట వినని వాని సంగతి చూస్తా” అంటూ సామెల్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారని ఆ ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రస్తావించారు..

ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత గులాబీ పార్టీ అనుకూల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు..” మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలా చేయలేదా.. అడ్డగోలుగా దోచుకోలేదా.. అసలు ఇలాంటి వ్యవహారాలు మొదలైందే మీతోనే కదా.. మీ పరిపాలన కాలంలో వైన్ షాప్ నిర్వాహకులతో అడ్డగోలుగా వ్యవహరించలేదా.. ఇష్టానుసారంగా దండుకోలేదా.. లంచాలు వసూలు చేసి నరకం చూపించలేదా.. ఇవాళ మీరేదో శుద్ధ పూసలు అయినట్టు చెబుతున్నారు అంటూ” కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతోంది… కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారంటూ సోషల్ మీడియా నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరైతే ఇలాంటి వాళ్లకు అధికారం ఇచ్చి తెలంగాణ ప్రజలు తప్పు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఎన్నికల్లో పెట్టిన ఖర్చు రికవరీ చేసుకోకపోతే ఎలా అంటూ ఇంకొందరు పేర్కొంటున్నారు.. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? తుంగతుర్తి ఎమ్మెల్యే ఎలాంటి సమాధానం చెబుతారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper